Baak : డివైడ్ టాక్ తో సూపర్ బ్రేక్ ఈవెన్ ! కానీ అడ్వాన్స్ ఫేక్ లెక్క ఎందుకో?

Baak : ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, నటుడు సుందర్. సి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హారర్ కం, డివోషనల్ ఫాంటసీ జోనర్ లో సినిమాలను తెరకెక్కించి అలరిస్తుంటారు.ఇక రీసెంట్ గా ఆయన దర్శకత్వంలో “బాక్” (అరణ్మనై 4) తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అరణ్మనై సిరీస్ లో నాలుగో భాగం కాగా, హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ గత వారం మే 3న రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ లో నటించగా, తెలుగులో ‘బాక్’ అనే పేరుతో రిలీజ్ చేసారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయ్యాక ఈ సినిమా తెలుగులో అంతంత మాత్రంగానే పెర్ఫార్మ్ చేస్తున్నా తమిళ్ లో మాత్రం మంచి కలెక్షన్లు రాబడుతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చిందని చెప్పాలి. కానీ అనూహ్యంగా భారీ కలెక్షన్లు రాబడుతుంది ఈ సినిమా. ముఖ్యంగా తమిళనాడు లో సినిమా కరువులో ఉన్నట్టు ఈ రొట్ట సినిమాకి ఎగబడ్డారు. ఇక తాజాగా అరణ్మణై సినిమా మొదటివారం కలెక్షన్ల లెక్కలు రాగా, ఈ సినిమా వారంలో బ్రేక్ ఈవెన్ అయిపోయి అందరికి షాక్ ఇచ్చింది.

డివైడ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ రచ్చ..

ఇక తెలుగులో రిలీజ్ అయిన హారర్ మూవీ బాక్ మరీ రొటీన్ అయిన హర్రర్ కామెడీ జానర్ వలన మిక్సడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. ఇక ఓపెనింగ్స్ పరంగానూ ఈ సినిమాకి డిజాస్టర్ వసూళ్లు వచ్చాయి తెలుగులో. తెలుగులో మొదటివారం పూర్తయ్యే సరికి 2.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 1.40 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది. ఇక సినిమా తెలుగు వాల్యూ టార్గెట్ 2.5 కోట్లు కాగా ఇంకా 1.1 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తమిళ్ లో మాత్రం అనూహ్యంగా రొటీన్ టాక్ తో భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక బాక్ సినిమా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
తమిళనాడు 30.45 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.80 కోట్లు, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 2.75 కోట్లు, ఇక ఓవర్సీస్ లో 4.95 కోట్ల గ్రాస్ రాబట్టగా, వరల్డ్ వైడ్ గా మొదటివారం 41.00 కోట్ల గ్రాస్ 20.05 కోట్ల షేర్ ని వసూలు చేసింది. మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 18 కోట్ల దాకా ఉండగా మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా మొదటి వారంలో మంచి జోరుని చూపించి బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం.

బ్రేక్ ఈవెన్ అయింది.. కానీ అడ్వాన్స్ లెక్క ఎందుకు?

అయితే అరణ్మణై 4(Baak) సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. బయ్యర్ల అదృష్టమో, లేక రిలీజ్ అయిన టైం బాగుందో తెలీదు గాని, ఈ సినిమా వారంలో బ్రేక్ ఈవెన్ అయింది. కానీ తమిళనాడు లో డిస్ట్రిబ్యూటర్ల లెక్కలు ఇప్పటికే 60 కోట్లు దాటిందని చూపిస్తున్నారు. కానీ ఇప్పటివరకు వచ్చింది 41 కోట్లే. మరి అంత ఎక్కువగా ఎందుకు చుపిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఏది ఏమైనా రొటీన్ ఫార్ములా సినిమాతో మరో సారి దర్శక నటుడు సుందర్ మళ్లీ హిట్ అందుకున్నాడని చెప్పాలి. ఇక ఈ సినిమా రెండో వారంలో కూడా మంచి జోరుని చూపించి లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు