Kannappa : కన్నప్ప కోసం కల్కికి నాలుగు రోజులు చాలట..! బహుశా ఆ 3 సీన్లు మాత్రమే కావచ్చు..!

Kannappa : మంచు ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత ప్రెస్టీజియస్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక భక్తిరస చిత్రం “కన్నప్ప”. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప చిత్రానికి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు సొంత నిర్మాణంలో 100 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు ఏడాది కాలంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ దాకా స్టార్ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ మధ్య న్యూజిలాండ్ లో లాంగ్ షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని అక్క‌డ నుంచి హైద‌రాబాద్ కి ఇటీవ‌లే షిప్ట్ అయింది. అటుపై హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్ లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంత‌రం కొంత గ్యాప్ త‌ర్వాత య‌ధావిధిగా మ‌ళ్లీ అక్క‌డే షూట్ మొద‌లైంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కూడా కీల‌క పాత్ర పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

కన్నప్ప కోసం ప్రభాస్ నాలుగు రోజులేనట..

తాజాగా కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ కూడా సెట్స్ లోకి అడుగుపెట్టడం జరిగింది. ప్ర‌త్యేకంగా వేసిన సెట్లో ప్ర‌భాస్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో ప్ర‌భాస్ పరమేశ్వ‌రుడి పాత్ర‌లో క‌నిపిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఆ పాత్ర‌లో ప్ర‌భాస్ ఆహార్యం అదిరిపోయింద‌ని చూసిన వారు చెబుతున్నారు. అయితే ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే పాల్గొంటారట. ఇందులో కేవ‌లం ప్ర‌భాస్ పై మాత్ర‌మే ఈ నాలుగు రోజులు షూట్ చేస్తార‌ని తెలుస్తోంది. ముందుగా ఆయ‌న పై షూట్ పూర్తి చేసి పంపిస్తే త‌ర్వాత నెమ్మ‌దిగా మిగ‌తా న‌టీన‌టుల‌పై చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొచ్చ‌న్న‌ది ప్లాన్ గా తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై ఇంత హైప్ పెరగడానికి ప్ర‌భాస్ ఎంట్రీనే మెయిన్ రీసన్ అని చెప్పొచ్చు. పైగా ప్ర‌భాస్ బ్రాండ్ తోనే బోలెడంత బిజినెస్ జ‌రుగుతుంది.

కన్నప్పలో ఆ మూడు సీన్లే ఈ 4 రోజుల్లో తీస్తారా?

ఇక కృష్ణంరాజు భక్త కన్నప్ప లో భక్తుడైన కన్నప్ప దగ్గరికి శివుడు మారువేషంలో వచ్చి హితబోధ చేస్తాడు. ఇక అంతకు ముందే కన్నప్ప భార్యకు కూడా కనిపించి కన్నప్ప కోసం ప్రసాదం ఇస్తాడు. పాత సినిమాలో భక్తుడికి భగవంతుడికి మధ్య జరిగిన ఈ సీన్స్ చాలా బాగుంటాయి. ఇక ఫైనల్ గా క్లైమాక్స్ లో కన్నప్పగా మారిన అర్జునుడికి శివుడు ప్రత్యక్షమై ముక్తి ప్రసాదిస్తాడు. బహుశా ఈ మూడు సీన్లలో మొదటి రెండైనా ఇప్పుడు షూట్ చేస్తారు కావచ్చు. లేదా సినిమాటిక్ గా, కొత్త కథనం జోడిస్తారా అన్నది కూడా చూడాలి. ఇక ఈ సినిమా(Kannappa)లో ఇతర కీలకమైన పాత్రలలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు తదితరులు పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మోహ‌న్ బాబు భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక మోహ‌న్ బాబు పై ఉన్న అభిమానంతో ప్ర‌భాస్ పారితోషికం తీసుకోకుండా న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం లో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు