GoodBadUgly : భాగ్యనగరంలో థలా సినిమా షూటింగ్..! ఇక్కడ ఆ సీన్లే కీలకం!

GoodBadUgly : టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాణం లో తమిళ్ స్టార్ థలా అజిత్ “గుడ్ బాడ్ అగ్లీ” పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమా కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం రీసెంట్ గానే జరగగా, తాజాగా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. తమిళ్ లో అధిక్ రవిచంద్రన్ చివరిసారిగా బ్లాక్ బస్టర్ డ్రామా ‘మార్క్ ఆంటోని’ని అందించాడు. ఇప్పుడు అజిత్ తో తీస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌ని నిర్మించారు, కాగా ఈ సెట్ యాక్షన్ సీక్వెన్స్‌ గా ఉండబోతోంది.

యాక్షన్ సీక్వెన్స్ కీలకం?

ఇక థలా అజిత్‌ తో కూడిన అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌ ను దాదాపు వారం రోజులు చిత్రీకరించడానికి ప్లాన్ చేయబడింది. ఇక ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చిన అజిత్ షూటింగ్ కి ముందే ఒక యాక్షన్ సన్నివేశాన్ని రిహార్సల్ చేశాడట. కానీ మేకర్స్ అధికారికంగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రారంభాన్ని ప్రకటించలేదు, మరియు సెట్ నుండి ఒక పోస్టర్ ని త్వరలో సోషల్ మీడియాలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో ఫాంటసీ చిత్రం అని సమాచారం. ఇక అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అజిత్ త్రిపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఒక నెలకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న అజిత్, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కోసం సన్నగా కనిపించడానికి కొన్ని కిలోలు తగ్గారట. ఇక దీంతో పాటు దర్శకుడు మగిజ్ తిరుమేనితో అజిత్ ‘విదాముయార్చి’ సినిమాతో బిజీ అయ్యాడు. ఇక తాజాగా గుడ్ బాడ్ అగ్లీ సినిమా షూటింగ్ లో అడుగుపెట్టారు. ఇక ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదటి షెడ్యూల్ ముగిసిన తర్వాత ‘విదాముయార్చి’ షూట్ తిరిగి ప్రారంభమవుతుంది.

హై టెక్నిషియన్స్..

ఇక థలా అజిత్ హీరోగా నటిస్తున్న ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (GoodBadUgly) మూవీ కోసం పని చేసే సాంకేతిక నిపుణులను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. విజయ్ వేలుకుట్టి ఎటిటర్ గా, సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్ స్టంట్స్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. ఇక ఈ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఇక అజిత్ చివరగా తునివు సినిమాలో నటించగా, గతేడాది పొంగల్ కు ఆ సినిమాతో వచ్చి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం అజిత్ విదా ముయార్చి మూవీలో కూడా నటిస్తున్నాడు. త్వరలో గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు