Varun Sandesh : “నింద” తో సీరియస్ గా వస్తున్నాడు.. ఆ ముసుగెవరిది?

Varun Sandesh : టాలీవుడ్ లో హ్యాపీ డేస్ సినిమా తో ఎంతో మంది హీరోలు నటులు పాపులర్ అయ్యారని తెలిసిందే. ఇక ఆ సినిమాలో మెయిన్ హీరోగా నటించిన వరుణ్ సందేశ్ కూడా అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. లవర్ బాయ్ గా వరుస సినిమాలు చేసాడు. తొలి సినిమా హ్యాపీ డేస్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో, ఆ తర్వాత కూడా కొత్త బంగారు లోకం సినిమాతో మరో హిట్ కొట్టి జోరు చూపించాడు. ఈ క్రమంలో వరుస సినిమా ఛాన్సులతో బిజీ అయ్యాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ ఆ సినిమాల తర్వాత వరుణ్ సందేశ్ నటించిన సినిమాలు, ఒక్కటి కూడా సరైన రెస్పాన్స్ దక్కించుకోలేక పోయాయి. దీంతో కొంత కాలం మూవీస్ కు బ్రేక్ ఇచ్చిన వరుణ్ సందేశ్, తన వైఫ్ వితికా శేరుతో కలిసి రియాలిటీ షో బిగ్ బాస్ లో కనిపించారు. హౌస్ లో తనదైన ఆటతీరుతో అందరినీ మెప్పించారు. ఇక ఆ తరువాత కూడా పలు టివి షో లలో సందడి చేసారు. ఇక ఇప్పుడు ఆ జోష్ తో మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు వరుణ్ సందేశ్.

“నింద” సినిమాతో ప్రేక్షకుల ముందుకు?

ఇక వరుణ్ సందేశ్ హీరోగా చేసిన క్రైమ్ థ్రిల్లర్ ‘చిత్రం చూడరా’ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. హర్ష వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ అనే మూవీ చేస్తున్నాడు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ రాసి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ లోగో, పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. వరుణ్ సందేశ్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ ను శుక్రవారం రిలీజ్ చేశారు. పోస్టర్ లో వరుణ్ అమయాకంగా కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ ముసుగులో ఉన్న వ్యక్తి రూపం కనిపిస్తోంది. అంతే కాకుండా.. పోస్టర్‌ ను రివర్స్ చేసి చూస్తే న్యాయదేవత విగ్రహం, ముసుగు వ్యక్తి రూపం కనిపిస్తూ ఆసక్తి రేపుతున్నాయి.

ఎవరా ముసుగు వ్యక్తి?

ఇక తాజాగా రిలీజ్ అయిన వరుణ్ సందేశ్ (Varun Sandesh) నింద మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రస్టింగ్ గా ఉండగా, ఆ పోస్టర్ లో మరి ఈ ముసుగు వ్యక్తి ఎవరు? అన్న ఆసక్తి నెలకొని ఉంది. ఇంతకీ వరుణ్ సందేశ్ కారెక్టర్ ఏంటి? అని సినిమా పై ఇంట్రెస్ట్ పెంచుతోంది ఈ పోస్టర్. ఇక ఆ పోస్టర్ ని గమనిస్తే సీరియస్ డ్రామాతో సినిమా వస్తుందని తెలుస్తుండగా, సినిమా నేపథ్యం అల్లరి నరేష్ నాంది సినిమాని పోలి ఉంటుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇక మే15న ఈ మూవీ టీజర్‌ ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రూపొందుతున్న ‘నింద’ మూవీకి సంతు ఓంకార్ సంగీతం అందిస్తున్నారు. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు