12YearsForDammuMovie : గుండెల మీద చేయేసుకుని సినిమా చూసి పుష్కరమైంది..

12YearsForDammuMovie : టాలీవుడ్ లో బోయపాటి శ్రీను సినిమాల శైలి చాలా ప్రత్యేకమైనదని తెలిసిందే. ఆయన తీసిన సినిమాల్లో అన్నిటిలోనూ, హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు, భారీ తారాగణం, అన్నిటికంటే ఎమోషన్స్ కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. అవి ఒకానొక సమయంలో ప్రేక్షకులకే విసుగు పుట్టిస్తాయి. అందుకే బోయపాటి హిట్ కొడితే సాలిడ్ గా కొడతాడు. ప్లాప్ కొడితే అంతకంనుంచి అందుకుంటాడు. అలా బోయపాటి శ్రీను తొలిసారిగా దెబ్బతిన్నది ‘దమ్ము’తో. జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము తో దుమ్ము లేపుదామని వచ్చి బోయపాటి శ్రీను దారుణంగా దెబ్బ పడడమే గాకుండా, నందమూరి అభిమానులను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా మంది ఇది ఎన్టీఆర్ సినిమా కన్నా బోయపాటి సినిమా అనే అంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ హైప్ తో రిలీజ్ అయిన ఈ మూవీ పై, అప్పట్లో బోయపాటి శ్రీను గుండెల మీద చేయి వేసుకుని సినిమా చూడమని తొలిసారిగా ఈ సినిమాకే చెప్పాడు. అలా హ్యాట్రిక్ హిట్లు కొట్టిన బోయపాటిని బాగా నమ్మి నందమూరి అభిమానులు భంగ పడ్డ దమ్ము (ఎప్రిల్ 27 2012) రిలీజ్ అయి నేటికీ పుష్కరమైంది.

హ్యాట్రిక్ తర్వాత బోయపాటి దమ్ము..

అయితే బోయపాటి శ్రీను వరుసగా భద్ర, తులసి, సింహా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల హిట్స్ తో అప్పటికే ఫుల్ జోష్ లో ఉన్నాడు. నిజానికి ఎన్టీఆర్ సింహా సినిమా చూసే ఛాన్స్ ఇచ్చినట్టున్నాడు. దమ్ము స్టోరీ కూడా బాలయ్య కే మ్యాచ్ అవుతుందని చాలా మంది అంటూ ఉంటారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం కథ పరంగా చంపుకునే ఫ్యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా, ఆ రోజుల్లో భారీ అంచనాలతో తెరకెక్కింది ఈ సినిమా. ఈ సినిమా మొదలైనప్పటి నుండి విడుదల అయిందాకా దమ్ము మూవీ గురించి వచ్చిన అప్డేట్స్, ప్రమోషన్లు అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులకు ఓ రేంజ్ లో కిక్కిచ్చేవి. ఇక రిలీజ్ కి ముందే ఎం. ఎం. కీరవాణి అందించిన పాటలు కూడా అద్భుతంగా హిట్ అయ్యాయి. ఫైనల్ గా దమ్ము సమ్మర్ స్పెషల్ గా ఎప్రిల్ 27న (12YearsForDammuMovie ) రిలీజ్ కాగా ఫస్ట్ షో నుండే మూవీకి అంత లేదన్న టాక్ వచ్చేసింది.

అభిమానులకు బోయ దెబ్బ..

ఇక ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ హైప్ తో రిలీజ్ అయిన దమ్ము లో అన్ని సీన్లు హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లతో నిండిపోవడంతో దమ్ము లో దుమ్ము లేపడం తప్ప కథ ఎక్కడ చూపించారని ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక దమ్ములో ఆ గునపం వంచే సీన్, ఒక్క పంచ్ తో ఎగిరి పడే సీన్లు మామూలుగా ట్రోల్ కాలేదు. ఇక్కడినుండి బోయపాటి శ్రీను ఫైట్లు వెతికి మరీ ట్రోల్ చేయడం నెటిజన్లు స్టార్ట్ చేసారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ని రాజ వంశ వారసుడిగా దత్తత పుత్రుడిగా చూపించడం ఫ్యాన్స్ కి నచ్చలేదు. నిజంగా వారసుడే అయినా ఆ సీన్ ని ఆసక్తికరంగా మలచలేకపోయారు. మహా అయితే ఈ సినిమాని కాపాడింది కీరవాణి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే అని చెప్పాలి. అందుకే దమ్ము అంతగా మెప్పించలేకపోవడానికి మరో కారణం. ఇక సినిమా ఆ రోజుల్లోనే 45 కోట్ల బిజినెస్ ని జరుపుకోగా, భారీ హైప్ వల్ల 32 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గాని, బోయపాటి గాని ఈ సినిమా దెబ్బ నుండి కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు