Brahmaji: వాంతులొస్తున్నాయి.. ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు..

Brahmaji.. దశాబ్ద కాలం క్రితం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పటికీ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిన అతి తక్కువ మంది క్యారెక్టర్ ఆర్టిస్టులలో నటుడు బ్రహ్మాజీ కూడా ఒకరు.. ఒకప్పుడు సింధూరం వంటి చిత్రాలలో హీరోగా నటించి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయారు.. హీరోగా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా ఇలా అన్ని తరహా పాత్రల్లో కూడా మెప్పించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక వయసులో తనకంటే పెద్దవారితో నైనా చిన్నవారితో నైనా సరే ఇట్టే కలిసిపోయే తత్వం.. కష్టపడే లక్షణమే ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టింది.. ఇకపోతే ఈయనను సినీ ఇండస్ట్రీలో ఆల్రౌండర్ అని పిలుస్తూ ఉంటారు.. ముఖ్యంగా నటనలోనే కాదు ముక్కుసూటి తనం కూడా ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చింది. సినిమాలతో పాటు రాజకీయాలు, ఇతర సమకాలీన అంశాల పైన స్పందిస్తూ ఉంటారు.

Brahmaji: Vomiting.. Sensational comments on AP politics..!
Brahmaji: Vomiting.. Sensational comments on AP politics..!

ఏపీ రాజకీయాలు శ్రీ బూతు పురాణం..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బ్రహ్మాజీ సరదా కామెంట్లు పెడుతూ ఉంటారు.. బ్రహ్మాజీ చెప్పే విధానం కూడా అందరికీ నచ్చడంతో ఆయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.. అయితే ఒక్కొక్కసారి విమర్శలకు, వివాదాలకు దారి తీసినా.. ఏ విషయంలో కూడా ఆయన తగ్గింది లేదు. ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయాలపై బ్రహ్మాజీ రెండే ముక్కల్లో స్పందించారు..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెత్తగా ఉన్నాయని.. వీటిని చూస్తూ ఉంటే వాంతులు వచ్చేలా అసహ్యంగా ఉన్నాయి.. శ్రీ బూతు పురాణం అంటూ ఒక ముక్కలో ట్వీట్ చేశారు బ్రహ్మజీ..

మాటలతోనే చమత్కారం..

ఇక చిత్ర సీమలోని కొందరు.. ఎన్నికల్లో ఎవరో ఒకరికి మద్దతుగా నిలబడితే.. బ్రహ్మాజీ మాత్రం ఇలా స్పందించడంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. ఇకపోతే బ్రహ్మాజీ తీరు ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడు ఇలాగే ఉంటుంది .. ఎందుకంటే ఈ యన స్టార్ యాంకర్ అనసూయ – స్టార్ హీరో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్యలో కూడా దూరి సంచలనం సృష్టించారు.గతంలో అనసూయ , విజయ్ దేవరకొండ అభిమానులకు లైగర్ సినిమా విషయంలో జరిగిన వివాదం దుమారం రేపింది. అనసూయ ట్వీట్ కి కౌంటర్ ఇస్తూ.. విజయ్ ఫ్యాన్స్ ఈమెను అటాక్ చేశారు. అనసూయను ఆంటీ ఆంటీ అంటూ రకరకాల మీమ్స్ తో రెచ్చిపోయారు.. దీనికి అనసూయ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.. తనను ట్రోల్ చేసిన వారిపై కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది.. అయితే ఈ గొడవలోకి బ్రహ్మాజీ వచ్చారు.. “వాట్ హ్యాపెనింగ్” అంటూ ఒక ట్వీట్ వదిలారు.. దీంతో ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఏం లేదు అంకుల్ అంటూ కామెంట్ పెట్టారు.. దీనికి వెంటనే బ్రహ్మాజీ స్పందిస్తూ.. అంకుల్ ఏంట్రా.. అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్ బాడీ షేమింగా.. అంటూ ట్వీట్ చేశారు. ఇది కచ్చితంగా అనసూయ వివాదం తాలూకు కౌంటర్ అంటూ రీ ట్వీట్ చేస్తూ రెచ్చిపోయారు నెటిజన్స్.. ఇలా ఒక్కటేమిటి ఏ విషయం పైన అయినా సరే చమత్కారంగా స్పందిస్తూ.. తనదైన శైలిలో వైరల్ అవ్వడం బ్రహ్మాజీ నైజం. ఇప్పుడు ఏపీ రాజకీయాలపై కూడా స్పందించడంతో రకరకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు