Sree Leela: పవన్‌ కళ్యాణ్‌ ను గెలిపించేందుకు రంగంలోకి శ్రీ లీల !

Sree leela supports pawan kalyan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటి… ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ను కొనసాగుతోంది. అయితే తాజాగా ఏపీ రాజకీయాలపై హీరోయిన్ శ్రీ లీల కీలక ప్రకటన చేసింది.

పిఠాపురం నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని… పిఠాపురం నియోజకవర్గ ఓటర్లను కోరింది. కచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తారని… అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది శ్రీ లీల. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ.

sree leela supports pawan kalyan

కాగా ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవాలని మెగాస్టార్ చిరంజీవి నుంచి జబర్దస్త్ కామెడియన్ల వరకు అందరు కోరుతున్నారు. ప్రతి ఒక్క టాలీవుడ్ స్టార్ పిఠాపురం వెళ్లి ప్రచారం కూడా చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ పై వంగ గీతాను వైసిపి పార్టీ బరిలో దింపింది.

- Advertisement -

ఇద్దరు కాపు నేతలు కావడంతో… పిఠపురం నియోజక వర్గంలో పోటీ రసవత్తరంగా ఉంది. పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు… సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ స్థాయిలో పవన్ కళ్యాణ్ కు ఓటు వేసేందుకు పిఠాపురం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. దాదాపు లక్ష్యం మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఈ సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు