Real Life Scam Web Series on OTT : రియల్ స్కామ్స్ ఆధారంగా వచ్చిన వెబ్ సిరీస్ లు… ఒక్కసారి చూడడానికి కూర్చుంటే కళ్ళు కూడా తిప్పుకోలేరు

Real Life Scam Web Series on OTT : నిజమైన స్కామ్స్ ఆధారంగా ఇప్పటి దాకా ఎన్నో వెబ్ సిరీస్ లు వచ్చాయి. వాటిలో కొన్నిటికీ మాత్రం ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పటిదాకా ఓటిటిలోకి వచ్చిన పాపులర్ రియల్ లైఫ్ స్కామ్స్ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ లు ఏంటో అప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఈ వెబ్ సిరీస్ ల ముందు కుర్చున్నారంటే కళ్ళు తిప్పుకోవడం కూడా కష్టమే. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఈ వెబ్ సిరీస్ లు.

1. స్కామ్ 1992 – ది హర్షద్ మెహతా స్టోరీ

ఈ సిరీస్ హర్షద్ మెహతా నిజ జీవితం ఆధారంగా రూపొందింది. దీన్ని సోనీ లివ్‌లో చూడవచ్చు. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో ప్రతిక్ గాంధీ టైటిల్ రోల్ హర్షద్ మెహతాగా నటించగా, సుచేతా దలాల్, శ్రేయ ధన్వంతి ప్రధాన పాత్రలలో నటించారు. సతీష్ కౌశిక్, అనంత్ మహదేవన్, రజత్ కపూర్, కెకె రైనా, లలిత్ పరిము, హేమంత్ ఖేర్, నిఖిల్ ద్వివేది కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

2. స్కామ్ 2003 : ది తెల్గీ స్టోరీ

ఈ వెబ్ సిరీస్ అబ్దుల్ కరీం తెల్గీ నిజ జీవితం ఆధారంగా రూపొందింది, దీనికి తుషార్ హీరానందానీ దర్శకత్వం వహించారు, హన్సల్ మెహతా సహ-దర్శకుడిగా ఉన్నారు. 2000ల ప్రారంభంలో అబ్దుల్ కరీం తెల్గీ చేసిన స్టాంప్ పేపర్ నకిలీల నేపథ్యంలో రియల్ స్టోరీ ఆధారంగా తెరపైకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో గగన్ దేవ్ రియర్, ముఖేష్ తివారీ, సనా అమీన్ షేక్, భరత్ జాదవ్, షాద్ రంధవా, దినేష్ లాల్ యాదవ్ ప్రధాన పాత్రలు పోషించారు. దీన్ని సోనీ లివ్‌లో చూడవచ్చు.

- Advertisement -

3. శిక్షా మండల్

భారతదేశంలోని విద్యావ్యవస్థలో అతిపెద్ద కుంభకోణం చుట్టూ తిరిగే నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన వెబ్ సిరీస్ శిక్షా మండల్. దీనికి సయ్యద్ అహ్మద్ అఫ్జల్ దర్శకత్వం వహించగా, గుల్షన్ దేవయ్య, గౌహర్ ఖాన్, పవన్ మల్హోత్రా నటించారు. 2022 సెప్టెంబర్ 15 నుంచి MX Playerలో స్ట్రీమింగ్ అవుతోంది.

4. స్పెషల్ 26

నీరజ్ పాండే దర్శకత్వం వహించిన పీరియాడికల్ ఈ హీస్ట్ థ్రిల్లర్ చిత్రం 1987 ఒపెరా హౌస్ దోపిడీ ఆధారంగా రూపొందింది. ఇందులో అక్షయ్ కుమార్, మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రల్లో నటించగా, అనుపమ్ ఖేర్, జిమ్మీ షెర్గిల్, కాజల్ అగర్వాల్, రాజేష్ శర్మ, దివ్య దత్తా, కిషోర్ కదమ్ సహాయక పాత్రల్లో కనిపించారు.

5. తునివు

హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన యాక్షన్ హీస్ట్ చిత్రం తునీవును బోనీ కపూర్ నిర్మించారు. ఇందులో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించగా, మంజు వారియర్, సముద్రఖని, జాన్ కొక్కెన్, అజయ్, వీర సహాయక పాత్రల్లో నటించారు. 1987లో పంజాబ్‌లో జరిగిన బ్యాంక్ దోపిడీ ఆధారంగా రూపొందింది. అప్పట్లో లూథియానాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.5.7 కోట్లు చోరీకి గురైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు