OTT Movie : భర్త ముందే వేరే మగాళ్ళతో భార్య రొమాన్స్…. ఈ బో*ల్డ్ మూవీని ఫ్యామిలీతో చూసే సాహసం చేశారో అంతే సంగతులు

OTT Movie : ఓటీటిలు అందుబాటులోకి వచ్చాక లాంగ్వేజ్ బారియర్ ను క్రాస్ చేసి మరీ కంటెంట్ ఉన్న మంచి సినిమాలను వీక్షిస్తున్నారు మూవీ లవర్స్. అందులో బో*ల్డ్ కంటెంట్ కూడా ఒకటి. కంటెంట్ బో*ల్డే అయినప్పటికీ ఆలోచింపజేసే కథలు ఎన్నో ఉన్నాయి. అందులోనూ వర్త్ వాచింగ్ అనే సినిమాల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. భర్త ముందే వేరే మగాళ్లతో భార్య రొమాన్స్ చేసే ఓ బో*ల్డ్ మూవీని రొమాంటిక్ జానర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు. అసలు ఈ మూవీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ప్రస్తుతం మనం మాట్లాడుకునే మూవీ పేరు డీప్ వాటర్. మనం మాట్లాడుకునే కంటెంట్ కు, టైటిల్ కు సంబంధం లేదు అనిపిస్తోంది కదా. కానీ అదే నిజం. 2022లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ దంపతులకు కచ్చితంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే పొరపాటున కూడా మర్చిపోయి ఫ్యామిలీతో ఈ మూవీని చూసారో అంతే సంగతులు.

ఇక డీప్ వాటర్ మూవీ స్టోరీ లోకి వెళ్తే… ప్రస్తుతం ఉన్న తరం వైవాహిక బంధం గురించి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటున్నారు. కొత్త కల్చర్ పేరుతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అందులో చాలామంది భార్యలు తమ భర్తలు తమను ప్రేమగా, కేరింగ్ గా చూసుకుంటే చాలు అని భావిస్తారు. కానీ కొంతమంది మాత్రం భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా సరే పక్క చూపులు చూస్తూ కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. భర్త దగ్గర లేనిది ఇంకేదో వాళ్ల దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుత తరంలో ఎంతో మంది ఇలాంటి జనాలు ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ బ్యాక్ డ్రాప్ కూడా అదే.

- Advertisement -

ఇక స్టోరీలోకి వెళ్తే భార్య, భర్త, కూతురు… అదొక అందమైన ఫ్యామిలీ. కానీ భార్య భర్తలు ఇద్దరికీ కలిసి ఉండడం ఇష్టం ఉండదు. అలాగని విడాకులు కూడా తీసుకోరు. కేవలం తమకు పుట్టిన పాప కోసమే కలిసి ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా భర్త ఆలోచన ఇది. కానీ భార్య మాత్రం తరచుగా ఇంటి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. దీంతో ఆ భర్త ఇంటిని విడిచి వెళ్లకుండా ఇష్టమైన వాళ్ళను ఇంటికే తెచ్చుకోమని సలహా ఇస్తాడు. అతని సలహా మేరకే ఆమె తనకు నచ్చిన వాళ్ళందరికీ ఏకంగా ఇంటికి తెచ్చుకొని, భర్త ముందే రొమాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఇక ఇందులో ఊహించని ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి మోహంలో పడిన వాళ్లంతా ఆ తర్వాత చనిపోయి కనిపిస్తారు. దీంతో అందరికీ ఆమె భర్త మీదే అనుమానం వస్తుంది. కానీ ఆధారాలు మాత్రం ఉండవు. మరి చివరికి ఈ కథ ఎక్కడికి చేరింది? హంతకుడు ఎవరు? ఎందుకు ఈ హత్యలన్నీ చేస్తూ వస్తున్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే సినిమాపై ఓ లుక్కెయ్యాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు