#GorrePuranam : గొర్రె పురాణం పొలిటికల్ టచ్

GorrePuranam: ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో సుహాసస్ ఒకరు. సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసినవి 4 సినిమాలు అయినా కూడా అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించాయి. అయితే ఒక సినిమా మాత్రం డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాలు కూడా ధియేటర్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోకుండా నచ్చని కథకు మాత్రమే గ్రీన్ సిగ్నల్స్ తమ కెరియర్ లో ముందుకు వెళుతున్నాడు సుహాస్.

ఛాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానల్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేసి అక్కడితో మంచి మంచి వీడియోలు చేస్తూ అప్పట్లోనే ఒక మంచి కాన్సెప్ట్స్ తో చాలా మంది సెలబ్రెటీల్ దృష్టిలో పడ్డాడు సుహాస్. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో కొన్ని పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపును సాధించుకున్నాడు. సందీప్ రాజ్ దర్శకుడుగా పరిచయమైన కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. ఈ సినిమాకి ఓటీటీ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ సినిమా తర్వాత సుహాస్ చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాను ఛాయ్ బిస్కెట్ నిర్మాణ సంస్థ నిర్మించింది.ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే సుహాస్ చేస్తున్న ప్రతి సినిమా కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది అని చెప్పొచ్చు.

- Advertisement -

రీసెంట్ గా ప్రసన్న వదనం అనే సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ గా ఉండటంతో సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా లభించింది. ఇకపోతే ప్రస్తుతం సుహాస్ చేస్తున్న సినిమా గొర్రె పురాణం. ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. టీజర్ సినిమా పైన ఆసక్తిని పెంచుతుందని చెప్పొచ్చు. టీజర్ లో ఒక గొర్రె ఒక బార్డర్ దాటడం. హిందూస్ ముస్లిం మధ్య గొడవను చూపించడంతో ఈ టీజర్ కొంతమేరకు ఆసక్తిని క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ఈ టీజర్ లో సుహాస్ ని ఒక ఖైదీల చూపించారు.

అలానే టీజర్ లో గొర్రె పరిగెడుతున్న టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వాయిస్ ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో అటాచ్ చేశారు. ఇది అందరిని ఆకర్షించుకుంటుంది. ఏదేమైనా కూడా దీంతో కొంచెం కాంట్రవర్సీ కూడా తెర తీసే అవకాశం ఉందని అర్థమవుతుంది. ఈ సినిమా కోసం మంచి అంచనాలతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకి పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు