Prathinidhi2 : ప్రతినిధి2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్క.. చిన్నదే ఈ మూమెంట్ లో పెద్దది!

Prathinidhi2 : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఒకరు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేసే హీరోల్లో నారా రోహిత్ శైలి మరింత భిన్నంగా ఉంటుంది. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే ఈ హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి కూడా చాలా కాలం అయింది. వరుస ప్లాపులతో ఈ హీరో కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. తాజాగా నారా రోహిత్ తన లేటెస్ట్ మూవీ ప్రతినిధి2 (Prathinidhi2) సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. మే10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా పొలిటికల్ నేపధ్యంలో తెరకెక్కింది. నారా రోహిత్ నటించిన ప్రతినిధి ఫస్ట్ పార్ట్ అప్పట్లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి పార్ట్ అప్పట్లో మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఇప్పుడు ఎలక్షన్స్ ఫీవర్ ఎక్కువగా ఉన్న టైంలో ఈ సినిమా వస్తూ ఉండటం అడ్వాంటేజ్ అయినా కూడా రీసెంట్ టైంలో వచ్చిన పొలిటికల్ సినిమాలు మాత్రం పెద్దగా ఆడియన్స్ ను మెప్పించ లేక పోయాయి. అయితే ఈ సినిమా పక్కా స్క్రీన్ ప్లే తో వస్తుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇదిలా ఉండగా ప్రతినిధి 2 సినిమా బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ తాజాగా వచ్చాయి.

తక్కువ బిజినెస్ టార్గెట్..

ఇక ప్రతినిధి సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ప్రతినిధి2 పర్వాలేదు అనిపించే బజ్ అయితే ఉంది. ఇక సినిమా చాలా వరకు ఓన్ గానే రిలీజ్ కానుండగా కొన్ని చోట్ల అడ్వాన్స్ లతో రిలీజ్ కానుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డీసెంట్ హిట్ అనిపించు కోవాలి అంటే మినిమమ్ 3.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుందని అంచనా. పొలిటికల్ ఫీవర్ ఎక్కువగానే ఉన్న ఈ టైంలో ఓపెనింగ్స్ బాగుండి ఎంతో కొంత బెటర్ టాక్ ను కనుక సినిమా సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతినిధి2 మూవీ డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. చాలా టైంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నారా రోహిత్ ఈ సినిమాతో కంబ్యాక్ ని ఎంతవరకు సొంతం చేసుకుంటాడో చూడాలి.

ఈ మూమెంట్ లో హిట్ అయితే రికార్డు అవుతుంది?

ఇక ప్రతినిధి 2 సినిమా పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాగా, ఎలెక్షన్లకి కేవలం మూడు రోజుల ముందు విడుదల అవుతుండడంతో, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కగా పలు పొలిటికల్ పార్టీల నుండి ఇబ్బంది కూడా జరిగే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమాను ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించగా, ఇక ఈ సినిమాలో దినేష్ రాజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్త, సచిన్ ఖడేకర్, అజయ్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయభాను, అజయ్ ఘోష్ తదితరులు నటించారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు