Vijayashanti: నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఆమె లాగేసుకుంది..అందుకే ఆలస్యం ..!

Vijayashanti..సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటీనటులకు తమకంటూ ఒక డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటాయి. అయితే కొంతమంది ఆ డ్రీమ్ రోల్ లో చేసి తమ కలను నెరవేర్చుకుంటే.. మరికొంతమంది ఆ కల నెరవేర్చుకోలేక సతమతమవుతూ ఉంటారు..ఇలాగే గతంలో సీనియర్ ఎన్టీఆర్ చేయాలనుకున్న సీతారామరాజు పాత్ర కృష్ణా చేయడంతో ఆ పాత్ర చేయలేక ఆ కోరిక ఆయన నెరవేర్చుకోలేకపోయారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఇబ్బంది పడుతోంది లేడీ అమితాబ్ విజయశాంతి.. తనకు ఒక పాత్ర చేయాలని చాలా ఇష్టంగా ఉండేదట.. అంతేకాదు ఆ పాత్రతోనే రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంది.. కానీ కుదరక ఆ పాత్ర వేరొకరు చేయడం తో తన కల మాత్రం నెరవేరకుండానే మిగిలిపోయింది. మరి ఆ పాత్ర ఏమిటి ? ఎవరు ఆ పాత్రను లాగేసుకున్నారు ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

Vijayashanti: My dream project was pulled by her..hence the delay..!
Vijayashanti: My dream project was pulled by her..hence the delay..!

అలాంటి పాత్రలే ముఖ్యం..

రాజకీయాలతో బిజీగా ఉన్న విజయశాంతి ఆమధ్య సినిమాలకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లో వెళ్లి అక్కడ మళ్ళీ పెద్దగా కనిపించలేదు.. 2005 నుంచే సినీ రంగానికి దూరంగా ఉన్న ఈమె దాదాపు 15 సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.. ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి ప్రచారం చేశారు.. గతంలో బిజెపిలో ఉన్న ఈమె బయట ఎక్కడ కనిపించలేదు. ఇక లేడీ అమితాబ్ గా పేరు దక్కించుకున్న ఈమె అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో తన మార్కు చూపించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం భారీ రెమ్యునరేషన్ , కథలో ఇంపార్టెన్స్ ఉంటేనే నటిస్తానని చెబుతోంది..

రుద్రమదేవి పాత్ర లాగేసుకుంది..

ఇకపోతే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చినా వద్దనుకొంది విజయశాంతి.. రాజకీయాలపైనే ఫోకస్ పెట్టింది.. అలాంటి సినిమాలు ఉంటేనే ఓకే చెబుతోంది.. ఇదిలా ఉండగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె తాజాగా కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే రీ యంట్రీ సమయంలో ఆమె చేద్దామనుకున్న ఒక పాత్రను అనుష్క చేసేయడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందట..

- Advertisement -

క్లారిటీ ఇదే..

విజయశాంతి మాట్లాడుతూ.. నేను తెలంగాణ బిడ్డను.. సినిమాలలో నుంచి రాజకీయాల్లోకి వచ్చాను.. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాను.. ఆ సమయంలో రుద్రమదేవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాను.. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన మహారాణి రుద్రమదేవి.. ఆమె కథతో నా రాజకీయ జీవితానికి కూడా కలిసి వస్తుందని అనుకున్నాను.. అయితే ఏదో ఆషామాషీగా చేసే సినిమా కాదు .. కాబట్టి స్క్రిప్టు సహా అన్నింటిని సిద్ధం చేసుకున్నాము ..చాలా సమయం పట్టింది ..బడ్జెట్ ఎక్కువైంది ..ఏదేమైనా నా సొంత సినిమాగా ఆ చిత్రాన్ని తీయాలనుకున్నాను. ఈలోపు తెలంగాణ రావడంతో మళ్లీ సినిమా తీయడం ఆలస్యమైంది. ఈలోపు ఆ సినిమాని ఇంకొకరు తీసేశారు అంటూ విజయశాంతి చెప్పుకొచ్చింది..

సమయం పట్టొచ్చు..

మరి రుద్రమదేవి సినిమా చూసి నేను చేసి ఉంటే మరోలా ఉండేదేమో ? అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అని మీడియా మిత్రులు అడగగా.. ఆమె మాట్లాడుతూ.. నేను రుద్రమదేవి సినిమాని చూడలేదు.. నాకు కుదరలేదు.. కావాలనుకుంటే ఇంకో రకంగా కూడా తీయవచ్చు.. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సమయం ఉంటుందో లేదో కూడా చెప్పలేను.. బాహుబలి సినిమా లాగా ఈ చిత్రానికి కూడా ఎక్కువ టైం పడుతుంది.. అందుకే రుద్రమ దేవి సినిమా చేయడం ఇప్పుడు కుదరని పని అంటూ చెప్పుకొచ్చింది విజయశాంతి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు