Prathinidhi2 : సినిమా ఆంధ్ర రాజకీయాల గురించి… నోరు విప్పిన డైరెక్టర్

Prathinidhi2 : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటించిన సినిమా “ప్రతినిధి2”. ఈ సినిమా నారా రోహిత్ గతంలో నటించిన ప్రతినిధి సినిమాకి సీక్వేల్ గా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా మెప్పించడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా (Prathinidhi2) ఫైనల్ గా రేపు (మే 10న) థియేటర్లలో రిలీజ్ అయిపోతుంది. ఇక ఈ మూవీతో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాయి. ఇక నారా రోహిత్ దాదాపు ఏడేళ్ల తర్వాత సినిమాలో నటించాడు. ఈ సినిమా తో నారా రోహిత్ కి మంచి రీ ఎంట్రీ కం బ్యాక్ హిట్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి తాజాగా చిత్ర యూనిట్ సహా దర్శకుడు మూర్తి ప్రెస్ మీట్ నిర్వహించగా ప్రతినిధి 2 సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

ప్రతినిధి2 భారత రాజకీయాలకు సంబంధించింది – డైరెక్టర్

ఇక డైరక్టర్ మూర్తి ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ ప్రతినిధి 2 సినిమా పై ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ప్రతినిధి 2 సినిమా ఎపి రాజకీయాల నేపథ్యంలో పొలిటికల్ లీడర్ల ను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కిన సినిమానా? అని విలేఖరి ప్రశ్నించిన దానికి డైరెక్టర్ మూర్తి రిప్లై ఇచ్చాడు. ప్రతినిధి 2 సినిమాలో ప్రస్తుత తెలుగు రాష్ట్రాల మంత్రుల గురించి కానీ, ఇతర రాజకీయనాయకుల గురించి కానీ ఇందులో ప్రస్తావించలేదని, అన్నిటికి మించి ఈ సినిమాలో ఆంధ్ర కానీ, తెలంగాణ రాజకీయాల ప్రస్తావన లేదని ఈ సినిమా భారత రాజకీయాలకు సంబంధించిన సినిమా అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇక దాంతో పాటు మరో విషయం కూడా ప్రస్తావించారు. తాజాగా సినిమా ట్రైలర్ చూసిన చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల గురించి ప్రతినిధి 2 ప్రెస్మీట్లో దర్శకుడు చెప్పుకొచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి ఓటు వేయండి అని చెప్పారు. కానీ నా పార్టీకి ఓటు వేయండి అని ఎక్కడా చెప్పలేదు. సో నా సినిమా కాన్సెప్ట్ ఆయనకి క్లియర్ గా అర్థమైందని జర్నలిస్ట్ మూర్తి మీడియా సమక్షంలో తెలిపారు.

రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా?

ఇక మే 10న రిలీజ్ అవుతున్న ప్రతినిధి 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలపై కాస్తైనా ప్రభావం చూపుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఏది ఏమయినా ఈ సినిమా ఎన్నికలకి ఇంకొన్ని రోజుల ముందు వచ్చి ఉంటె సినిమా చూసే కొంతమంది జనాలకు ఓటింగ్ పై ఒక అవగాహన వచ్చి ఉండేదని పలువురు భావిస్తున్నారు. ఇక ఎలక్షన్లకు సరిగ్గా మూడు రోజుల ముందు రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఇక ప్రతినిధి2 సినిమాలో దినేష్ రాజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్త, సచిన్ ఖడేకర్, అజయ్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయభాను, అజయ్ ఘోష్ తదితరులు నటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు