Hanuman : ఎన్నో అంచనాలు.. కానీ హనుమాన్ కి కూడా తప్పలేదు ఈ టిఆర్పి బాధ!

Hanuman : టాలీవుడ్ లో ఈ మధ్య రిలీజ్ అయిన భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయినా టెలివిజన్ స్ట్రీమింగ్ కి వచ్చే సరికి అంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేకపోతున్నాయి. ఈ మధ్య రిలీజ్ అయిన గుంటూరు కారం, సలార్ వంటి భారీ చిత్రాలకు కూడా చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి. అయితే చాలా మంది ప్రేక్షకులు ఈ సంక్రాంతికి పెద్దగా అంచనాలు లేకుండా ఓ మీడియం రేంజ్ చిన్న సినిమాగా వచ్చి అఖండ విజయం సాధించిన సినిమా “హనుమాన్” సినిమా టెలివిజన్ స్ట్రీమింగ్ లో భారీ స్థాయిలో టిఆర్పి నమోదు చేస్తుందని అభిప్రాయపడ్డారు. పురాణాల్లోని రియల్ సూపర్ హీరో అయిన హనుమంతుడి నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల అయింది. ఎవరూ ఊహించని విధంగా రూ. 300 కోట్లు గ్రాస్ రాబట్టి ఎన్నో రికార్డులను సైతం ఇది సృష్టించింది. విజువల్ వండర్‌గా రూపొందిన ‘హనుమాన్’ మూవీ థియేటర్లలో విడుదలైన యాభై రోజుల తర్వాతనే జీ 5లో స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు. ఇందులో థియేటర్లలో మాదిరిగానే ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అంతటి సక్సెస్ సాధించిన ఈ సినిమా టెలివిజన్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని అందరూ వెయిట్ చేసారు.

హనుమాన్ కూ తప్పలేదు?

ఇక థియేటర్లలో రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించిన హనుమాన్ (Hanuman) మూవీ రీసెంట్ గా ఓటిటి లోనూ రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించింది. ఇక థియేటర్లలో, ఓటీటీలోనూ సక్సెస్ అయిన ‘హనుమాన్’ మూవీ… కొద్ది రోజుల క్రితమే జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. ఇక టెలివిజన్ లో కూడా దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు. టిఆర్పి రేటింగ్స్ బద్దలువుతాయని అనుకున్నారు అందరూ. కానీ ఈసారి కొంచెం నిరాశపరిచిందని చెప్పాలి. హనుమాన్ సినిమా తాజాగా 10.26 టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. నెటిజన్లు ఈ సినిమా దాదాపు 20 కంటే ఎక్కువ రేటింగ్ సాధిస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పైగా ఈ ఏడాది ఎక్కువ టిఆర్పి రేటింగ్ వచ్చిన చిత్రాల్లో ‘ఆదికేశవ’ (10.47) తర్వాతి స్థానంలో హనుమాన్ నిలిచింది. అయితే రీసెంట్ గా వచ్చిన భారీ స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే హనుమాన్ కి చాలా బెటర్ రేటింగ్స్ వచ్చాయని చెప్పొచ్చు.

పండగ స్పెషల్ గా వచ్చి ఉంటె భారీగా వచ్చేదా?

ఇక రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ప్రభాస్ ‘సలార్’ 6 రేటింగ్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కంటే హనుమాన్ సినిమాకి మంచి రేటింగ్ రావడం గమనార్హం. అయితే హనుమాన్ సినిమాని శ్రీరామనవమి కానుకగా, లేదా హనుమాన్ జయంతి స్పెషల్ గా రిలీజ్ చేసి ఉంటే మంచి రేటింగ్స్ సాధించేదని పలువురు నెటిజన్ల అభిప్రాయం. ఇక తేజ సజ్జా – ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు హనుమాన్ కి సీక్వెల్ గా “జై హనుమాన్” 2025 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు