AP Elections 2024 : ఫైనల్‌గా పవన్‌కు బన్నీ సపోర్ట్… నేనున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్

AP Elections 2024.. సినీ ఇండస్ట్రీలో హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది.. ముఖ్యంగా కలెక్షన్ల విషయంలో, సినిమా హిట్ ఫ్లాప్ లాంటి విషయంలో కూడా వార్ తరచూ ఎక్కువగా వింటూనే ఉంటాము. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ రచ్చ మరింత ఎక్కువైంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఇలాంటి విషయాలను మాత్రం స్టార్ హీరోల ఏమాత్రం పట్టించుకోకుండా.. తామందరం ఒకటే అన్నట్టుగా తెలియజేస్తూ.. ఎన్నో సందర్భాలలో.. ఒకరి సినిమాలు మరొకరు ప్రమోట్ చేస్తూ ఆడియో ఫంక్షన్లకు , సక్సెస్ మీట్లకు వస్తూ ఉన్నారు.

పవన్ కు మద్దతుగా స్టార్స్..

అలా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలకు స్టార్ హీరోలు సైతం రావడం జరిగింది. అయితే ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోల మీద ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.. అదేమిటంటే రాజకీయాలకు దూరంగా ఉండడమే.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా నిలబడుతూ ఉన్నారు.. దీంతో చాలామంది ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో కూడా తమ మద్దతును వెల్లడిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా బన్నీ..

ఇలాంటి తరుణంలో స్టార్ హీరోలు సైతం ఎవరు కూడా పవన్ కళ్యాణ్ కు జనసేనకు ఓటు వేయాలని చెప్పకపోవడంతో స్టార్ హీరోల పైన పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ అభిమానుల పై ఫైర్ అవుతున్నారు.. దీంతో గడిచిన కొన్ని నిమిషాల క్రితం అల్లు అర్జున్ తన ట్విట్టర్ నుంచి.. “నా కుటుంబం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది.. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీరు ఎంచుకున్న దారిని చూసి మేము ఎప్పుడు గర్విస్తూనే ఉంటాము. ఒక ఫ్యామిలీ మెంబర్గా నా ప్రేమ, సపోర్టు ఎప్పుడూ మీకు ఉంటాయి. మీరు ఎంచుకున్న దారిలో ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. మీకోసం నేనున్నాను” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ షేర్ చేస్తూ తన ట్విట్టర్ నుంచి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

- Advertisement -

ఈ స్టార్స్ పై అభిమానులు ఫైర్..

మరోవైపు అల్లు అరవింద్ మెగా కుటుంబ సభ్యుడు కాబట్టి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ ని మాత్రమే పొగడడం జరిగింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు మాత్రం పవన్ కళ్యాణ్ విషయం పైన ఎక్కడ మాట్లాడలేదు. కేవలం వీరంతా కూడా తమ సినీ కెరియర్ మీదే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా.. ఇటీవల కాలంలో ఎక్కువగా రాజకీయాల వైపు మాత్రం అడుగులు వేయలేదు.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం బిజెపి పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా తెలియజేసింది. ఇంకోవైపు మహేష్ బాబు తన 29వ చిత్రం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అవుతూ పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించాలంటే కామెంట్లు చేస్తున్నారు.. మరి రాబోయే రోజుల్లో ఎవరు ఏ పార్టీకి మద్దతిస్తారో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు