Deverakonda brothers: అన్న బర్త్ డే.. తమ్ముడు ఎమోషనల్..పోస్ట్ వైరల్..!

Deverakonda brothers.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన దేవరకొండ బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మొదట విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తన కెరీర్ ను మార్చుకొని.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. ఇక చివరిగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉండగా ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కాగా.. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన తమ్ముడు ప్రముఖ హీరో ఆనంద దేవరకొండ కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడం వైరల్ గా మారింది

Deverakonda brothers: Elder brother birthday.. younger Brother emotional.. Post viral..!
Deverakonda brothers: Elder brother birthday.. younger Brother emotional.. Post viral..!

అన్న బర్తడే.. తమ్ముడి ఎమోషనల్ పోస్ట్..

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. బేబీ చిత్రంతో స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. ఇక ఈయన కూడా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టుతో తన అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లడించారు.. అంతేకాదు వారిద్దరి చిన్ననాటి ఫోటోలను పంచుకున్నారు ..”జన్మదిన శుభాకాంక్షలు అన్న ..ఎలా జీవించాలో నువ్వు నాకు ఓ సజీవ ఉదాహరణ.. మీ నుండి క్రమశిక్షణ, బలం, నిజాయితీ, విశ్వాసం ఇలా చాలా నేర్చుకోవచ్చు.. మీరు పడిపోయిన ప్రతిసారి బలంగా తిరిగి వస్తారు.. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాము అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు ఆనంద్ దేవరకొండ..ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేయడంతో అభిమానులు కూడా ఈ పోస్టుపై రకరకాలుగా స్పందిస్తున్నారు..

విజయ్ దేవరకొండ సినిమాలు..

ఇకపోతే ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో ఆయన చేయబోయే సినిమా విశేషాలను పంచుకున్నారు ..ఈయన చేతిలో ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాలు ఉండగా అందులో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.. ప్రస్తుతం ఈ చిత్రానికి VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.. మరో చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వహించిన 59వ చిత్రం గా ఈ సినిమా నిలవబోతోంది.. ఇక మరోవైపు సంకృత్యాన్ దర్శకత్వంలో. ఒక చిత్రాన్ని ప్రకటించారు. ఇక ప్రస్తుతం మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలతో మళ్లీ అర్జున్ రెడ్డి రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.. మరి విజయ్ దేవరకొండ కెరియర్ ఎలా మలుపు తిరగబోతుందో చూడాలి ..ఇక ఆనంద్ దేవరకొండ కూడా ఇప్పుడిప్పుడే కథలు వింటూ మంచి సక్సెస్ అందుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు