Director Murthy about #ChandrababuNaidu’s response: నా సినిమా కాన్సెప్ట్ ఆయనికి క్లియర్ గా అర్థమైంది.

Director Murthy about #ChandrababuNaidu’s response: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ లో నారా రోహిత్ ఒకరు. బాణం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు నారా రోహిత్. మొదటి సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కాకపోయినా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికాడు అని అనిపించుకున్నాడు నారా రోహిత్. ఇకపోతే ఆ తర్వాత నారా రోహిత్ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా ఫర్ఫెక్ట్ గా మంచి సినిమాలు ఎంచుకుంటూ తన కెరియర్ లో ముందుకెళ్లాడు నారా రోహిత్. ఒక స్టేజ్ లో నారా రోహిత్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే అది ఖచ్చితంగా సొసైటీకి ఉపయోగపడుతుంది. మంచి కాన్సెప్ట్ ని ఎంచుకుంటాడు అని ఆడియన్స్ లో కూడా ఒక ఆలోచనతో మరి థియేటర్ కి వెళ్లేవారు. సినిమాలు కూడా అలానే ఉండేవి. నారా రోహిత్ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. చాలామంది దర్శకులును కూడా నారా రోహి త్ పరిచయం చేశాడు.

ఇక నారా రోహిత్ కెరియర్ లో ఉన్న ప్రతినిధి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతినిధి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కాదు. ఇక ప్రతినిధి కథ విషయానికి వస్తే ‘మంచోడు’ శ్రీను (నారా రోహిత్‌) ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేసి తన అదుపులో ఉంచుకుంటాడు. తన డిమాండ్లు తీర్చకపోతే ముఖ్యమంత్రిని చంపేసి తాను కూడా చనిపోతానని బెదిరిస్తాడు. అతని డిమాండ్లు తీర్చడం ఎవరి తరం కాదు. కానీ అతను అడిగే దానికీ, అతని లక్ష్యానికి పొంతన ఉండదు. మంచోడు శ్రీను ఎవరు? ఎందుకోసం ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేసేంత సాహసానికి ఒడికట్టాడు. అతని నేపథ్యమేంటి? చివరిగా తాను చేసిన దానికి అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.

ఇకపోతే రీసెంట్ గా సినిమాలకు నారా రోహిత్ బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ నారా రోహిత్ తన సినిమాకి సీక్వెల్ తో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ప్రతినిధి 2 సినిమాతో మళ్లీ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు నారా రోహిత్. అయితే ఈ సినిమాతో జర్నలిస్టుగా మంచి గుర్తింపు సాధించుకున్న మూర్తి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. జర్నలిస్టు మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

ఎన్నో ఇష్యూస్ ను తన స్టూడియోలో కూర్చొని సాల్వ్ చేశారు జర్నలిస్టు మూర్తి. అయితే తన మొదటిసారి దర్శకత్వం వహించడంతో అందరికీ క్యూరియాసిటి తో ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కూడా ఆ ట్రైలర్ ను చూపించాడు జర్నలిస్టు మూర్తి. అయితే ఆ ట్రైలర్ చూసిన వెంటనే ఆయన రెస్పాన్స్ ఏంటి అని రీసెంట్ గా జరిగిన ప్రతినిధి 2 ప్రెస్మీట్లో చెప్పుకొచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి ఓటు వేయండి అని చెప్పారు. కానీ నా పార్టీకి ఓటు వేయండి అని ఎక్కడా చెప్పలేదు. సో నా సినిమా కాన్సెప్ట్ ఆయనకి క్లియర్ గా అర్థమైందని జర్నలిస్ట్ మూర్తి మీడియా సమక్షంలో తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు