OTT Bold Movie : 19 ఏళ్ల కొడుకును ముగ్గులోకి దింపిన అమ్మాయికి కారు గిఫ్ట్… తల్లిదండ్రుల బో*ల్డ్ డెసిషన్

OTT Bold Movie : ఓటిటిల క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతం ఒక్కొక్కరి దగ్గర మూడు నాలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సబ్స్క్రిప్షన్ తప్పకుండా ఉండేలా చూసుకుంటున్నారు. ఇక ప్రతివారం వాటిలో విడుదలయ్యే ఒక్కో జానర్ సినిమాని మిస్ అవ్వకుండా చూసేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం రొ*మాంటిక్ సినిమాలను వివిధ కారణాల వల్ల వదిలేస్తూ వస్తున్నారు. రొమాంటిక్ అనగానే బో*ల్డ్ సీన్లు తప్ప ఇంకేముంటాయి? అనే ఆలోచనతో ఈ జానర్ సినిమాల జోలికి వెళ్లకుండా దూరం పెట్టేస్తున్నారు. కానీ ప్రస్తుతం హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఈ బో*ల్డ్ జానర్ సినిమాలలో ఎన్నో అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. అందులో బో*ల్డ్ కంటెంట్ కూడా ఉంటుందనుకోండి. అయితే బో*ల్డ్ నెస్ తో పాటే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ.

మన దేశంతో పోల్చుకుంటే విదేశాల్లో కల్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అక్కడ 18 ఏళ్లు దాటిన తర్వాత పిల్లలు వాళ్ళ లైఫ్ ను వాళ్లే చూసుకోవాల్సి ఉంటుంది. సంపాదన నుంచి మొదలు పెట్టి రొమాన్స్ దాకా అన్ని విషయాలు వాళ్లంతట వాళ్ళే స్వయంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సోషల్ లైఫ్ కి అలవాటు పడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ బోల్డ్ కంటెంట్ మూవీ పేరు నో హార్డ్ ఫీలింగ్స్. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఓ 19 ఏళ్ల కుర్రాడు ఎప్పుడూ రిజర్వ్డ్ గా ఉంటాడు. అమ్మాయిలతో మాట్లాడడం, డేటింగ్ కి వెళ్లడం వంటివి అతనికి అస్సలు ఇష్టం ఉండదు. కనీసం గదిలో నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టడు. దీంతో ఇతన్ని నార్మల్ గా చేయాలి అని భావించిన వాళ్ళ పేరెంట్స్ ఊహించని బో*ల్డ్ ప్లాన్ వేస్తారు. తమ 19 ఏళ్ల పిల్లాడిని డేటింగ్ చేసిన అమ్మాయికి కారును వాడుకునేందుకు అవకాశం ఇస్తామంటూ ప్రకటిస్తారు. ఈ ప్రకటనను చూసిన హీరోయిన్ జెన్నీఫర్ లారెన్స్ అతనితో డేటింగ్ చేయడానికి సిద్ధమవుతుంది.

- Advertisement -

వయసులో పెద్దదే అయినప్పటికీ తన దగ్గర ఉన్న కారును ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తీసుకోవడంతో ఈ డెసిషన్ తీసుకుంటుంది. నిజానికి ఆమె తనకు నచ్చిన వాళ్ళతో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ జాబ్ చేయాలంటే తిరగడానికి కచ్చితంగా కారు కావాలి కాబట్టి ఆ కుర్రాడిని డేటింగ్ చేయడానికి ముందుకు వస్తుంది. ఆ తర్వాత పేరెంట్స్ పెట్టిన కండిషన్ ప్రకారం అతడికి బయట ప్రపంచం ఎలా ఉంటుంది? సోషల్ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి అనే అంశాలను దగ్గరుండి నేర్పిస్తుంది. ఈ క్రమంలో మధ్య మధ్యలో చాలావరకు ఘాటు సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు గనక ఈ మూవీని చూడాలనుకుంటే సింగిల్ గా చూడడం మంచిది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు