Gorre Puranam Teaser: దుమ్ములేపుతున్న “గొర్రె పురాణం” టీజర్

Gorre Puranam Teaser: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది యంగ్ హీరోలు రాణిస్తున్నారు. తమ సినిమా తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేసి… ఆ తర్వాత పెద్ద హీరోలు అయిపోతున్నారు. ఎవరు చేయని పాత్రలు చేసి… సక్సెస్ అందుకుంటున్నారు.

అలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ఒకరు. హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కలర్ ఫోటో అనే సినిమాతో తన కెరీర్ పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారిపోయాడు హీరో సుహస్. ఇక ప్రస్తుతం సుహాస్ హీరోగా గొర్రె పురాణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

- Advertisement -

ఇక ఈ టీజర్ చూస్తే.. సినిమా మొత్తం గొర్రె చుట్టూ కథ నడిచినట్లు అర్థమవుతుంది. హిందూ అలాగే ముస్లిం మతాల మధ్య ఈ గొర్రె తెలుస్తోంది. అయితే ఈ వివాదాన్ని హీరో సుహాస్ ఎలా పరిష్కరిస్తాడు.. అనేది ఈ స్టోరీ. అంతేకాకుండా అసలు సుహాస్ జైలుకు ఎందుకు వెళ్ళాడు..? గొర్రె కథ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు