Sivakarthikeyan : దళపతి విజయ్ మూవీలో శివకార్తికేయన్..?

Sivakarthikeyan : ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు చాలానే వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన మల్టీ స్టార్ సినిమాలు బంపర్ హిట్ అందుకున్నాయి. ఇండస్ట్రీ ఏదైనా సరే బడా హీరోలు ఇద్దరు ఒకే సినిమాలో కనిపిస్తే జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. కథ బాగుంటే ఆ సినిమా కచ్చితంగా బంపర్ హిట్ అవుతుంది. చాలామంది దర్శకులు యాక్షన్ సినిమాలలో మాత్రమే మల్టీస్టారర్ కాంబినేషన్ తీసుకువస్తారు. అయితే ఇప్పుడు విజయ్ దళపతి కూడా ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట.

విజయ్ దళపతి సినిమాలో శివ కార్తికేయన్ నటించబోతున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ గోట్ సినిమా చేస్తున్న సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం పేరుతో ఈ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను వెంకటేష్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించనుంది. సెప్టెంబర్ 5వ తేదీన విజయ్ దళపతి సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఇక ఈ పాన్ ఇండియా మూవీ తమిళం తో పాటు తెలుగు అలాగే హిందీ భాషలలో రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో చాలామంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. స్నేహ, లైలా, కమెడియన్ యోగిబాబు, వైభవ్, అరవిందు ఆకాష్, అజయ్ రాజ్ లాంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

- Advertisement -

అంతేకాదు ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇక.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో ఈ సినిమా గురించి వరుసగా రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా విజయ్ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించబోతున్నారని వార్త చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఐదు నిమిషాల పాటు కనిపించనున్నాడట శివ కార్తికేయన్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు