Rashmi: పబ్లిక్ గా మందు కొడ్తున్న యాంకర్ రష్మీ ?

Rashmi: తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తెలుగు బాగా నేర్చుకొని స్టార్ యాంకర్లుగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా తెలుగు యాంకర్లకు పోటీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు రాణిస్తున్నారు. అలాంటి వారిలో సుమ మరియు రష్మీ ఉన్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో యాంకర్ రష్మీ ది ఒరిస్సా.

అయినప్పటికీ తెలుగు బాగా నేర్చుకొని తెలుగు ఇండస్ట్రీలో బాగా రాణిస్తోంది. వరుసగా చాలా షోలలో యాంకర్ గా పని చేస్తూనే అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తోంది ఈ బ్యూటీ. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షో లాంటి అదిరిపోయే షోలలో యాంకర్ గా పనిచేస్తుంది రష్మీ. కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. యాంకర్ గానే బాగా రాణిస్తోంది. సినిమాలలో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ హాట్ బ్యూటీ.

జబర్దస్త్ షో లో యాంకర్ గా కనిపించిన తర్వాత రష్మీ జీవితమే మారిపోయిందని మనం చెప్పవచ్చు. జబర్దస్త్ షో రష్మీకి ఫుల్ పాపులారిటీ కూడా తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ షోలో సుడిగాలి సుదీర్ మరియు యాంకర్ రష్మీ మధ్య ఉన్న కోఆర్డినేషన్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు వీరిద్దరూ లవర్స్ అన్నట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు. దానివల్ల కూడా రష్మీకి మంచి పేరు వచ్చింది.

- Advertisement -

అంతేకాదు వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారని… త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈమధ్య వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని కూడా కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు. సుదీర్ ను కాదని అమెరికాకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకునేందుకు రష్మీ సిద్ధమైనట్లు… ప్రచారం చేస్తున్నారు కొంతమంది. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడంతో వీరి పెళ్లి ఈ ఏడాది జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక త్వరలోనే దీనిపై ప్రకటన కూడా రానుందట.

ఇదంతా పక్కకు పెడితే తాజాగా రష్మికకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల రష్మిక బర్త్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫారెన్ వెళ్లిన ఈ బ్యూటీ… అక్కడ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసింది. పబ్బులకు వెళ్లి మరి దుమ్ము లేపింది రష్మి. ఈ నేపథ్యంలోనే ఓ మందు గ్లాస్ పట్టుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది ఈ బ్యూటీ. దీంతో రష్మి కూడా యాంకర్ అనసూయ భరద్వాజ్ లాగానే తయారవుతోందని కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బర్త్డే సందర్భంగా ఎంజాయ్ చేయడం తప్పేమీ కాదని కొంతమంది ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు