Sobhita Dhulipala: ఆ హీరోతో అలాంటి పనులు.. కన్ఫర్మ్ చేసిన శోభిత ?

Sobhita Dhulipala: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా కూడా కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. చేసేవి తక్కువ సినిమాలు అయినప్పటికీ… హాట్ షో లేదా రూమర్స్ కారణంగా పాపులర్ అవుతూ ఉంటారు హీరోయిన్లు. అలాంటి వారిలో శోభిత ధూళిపాళ ఒకరు. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ… ఎక్కువగా కాంట్రవర్సీ అవుతూ ఉంటారు. ముఖ్యంగా నాగచైతన్య కారణంగా ఈ బ్యూటీ పేరు తెగ వైరల్ అవుతూ ఉంటుంది.

హీరోయిన్ శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అందాల తార ఏపీలో పుట్టి పెరిగినా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు చేసింది. 2016 సంవత్సరంలో రామన్ రాఘవ్ 2.0 సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించి అందరిని కనువిందు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగింది ఈ బ్యూటీ. 2018 సంవత్సరంలో గూడచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

అటు మలయాళం లో కూడా ఈ బ్యూటీ మెరిసింది. తమిళ ఇండస్ట్రీలో కూడా 2022లో ఈ బ్యూటీ నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత ధూళిపాళ ఇద్దరు ప్రేమలో ఉన్నారని… గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కొంతమంది ఈ ప్రచారం చేశారు.

- Advertisement -

అయితే తాజాగా ఈ జంట గురించి ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. ఇటీవల జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసిన శోభిత…C,H,D అనే ఇంగ్లీషు లెటర్స్ ఉన్న ఇయర్ రింగ్స్ ధరించి కనువిందు చేసింది. దీంతో సి అంటే నాగచైతన్య అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే డి అంటే శోభిత ధూళిపాళ్ల అని అంటున్నారు. ఈ ఇయర్ రింగ్స్ వాడి వారి మధ్య ఉన్న రిలేషన్ బయటపెట్టిందని ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక గతంలో కూడా నాగచైతన్య అలాగే శోభిత లండన్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడకి వేరువేరుగా వెళ్లి… ఆ తర్వాత కలుసుకున్నారని ప్రచారం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు