Sonam Kapoor: సంతోషంతో పాటూ బాధ కూడా..అన్నీ మారిపోయాయ్..!

Sonam Kapoor.. అమ్మాయిలు ఎంత వయసొచ్చినా సరే నాజూగ్గా ఉండాలని.. అందంగా కనిపించాలని.. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అమ్మాయిలు వివాహమనంతరం తప్పకుండా మాతృత్వాన్ని పొందుతారు.. అయితే మాతృత్వాన్ని పొందిన తర్వాత ఉన్నట్టుండి కొంతమంది బరువు పెరుగుతారు.. అయితే ఇందులో కూడా కొందరు డెలివరీ తర్వాత మామూలు అయినప్పటికీ.. మరికొందరు మాత్రం మరింత బరువు పెరిగి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు తన విషయంలో కూడా ఇదే జరిగిందని చెబుతోంది బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్..

Sonam Kapoor: Happiness and sadness too..everything has changed..!
Sonam Kapoor: Happiness and sadness too..everything has changed..!

డెలివరీ తర్వాత 32 కిలోలు బరువు పెరిగా..

2022 ఆగస్టులో సోనం కపూర్ – అహుజా దంపతులు వాయు అనే కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను 32 కిలోలు పెరిగాను.. నిజంగా చాలా బాధేసింది.. అయితే ఆ సమయంలో బిడ్డ గురించి ఆలోచిస్తానే తప్ప సరైన ఫుడ్ తీసుకోవాలని.. వర్కౌట్ చేయాలని ఆలోచించము.. అలా డెలివరీ తర్వాత అలా బరువు పెరిగిపోయాను.. ఇప్పుడు మామూలు అవ్వడానికి నాకు ఏడాదిన్నర సమయం పట్టింది.. అయితే అప్పటికే జీవితం మొత్తం మారిపోయింది.. ఒక భర్తతోనే కాదు మనతో మనకున్న అనుబంధం కూడా మారిపోతుంది అంటూ తెలిపింది సోనమ్ కపూర్..

బరువు మొత్తం తగ్గిపోయా..

నేను బరువు తగ్గినా కూడా మునుపటిలాగా నా శరీరం గురించి నేను ఆలోచించలేకపోతున్నాను.. ఎంత సేపు ఉన్నా నా బిడ్డ గురించే ఆలోచన ఎక్కువ అవుతుంది.. అంటూ తెలిపింది.. ఇకపోతే ఏడాది ప్రారంభంలోనే వర్కౌట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసింది సోనమ్ కపూర్.. ఈ నేపథ్యం లోనే తన జిమ్ వీడియోలు షేర్ చేస్తూ.. వావ్ 20 కిలోలు తగ్గాను.. ఇంకా ఆరు కేజీ లు తగ్గాలి అంటూ కూడా రాసుకుంది.. అయితే ఆ 6 కూడా ఎప్పుడో తగ్గి మరింత స్లిమ్ గా మారిపోయింది సోనమ్ కపూర్ .. మొత్తానికైతే సోనం కపూర్ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

సినిమా కెరియర్..

సోనమ్ కపూర్ కెరియర్ విషయానికి వస్తే.. జాతీయ చలన చిత్ర అవార్డు అలాగే ఫిలింఫేర్ అవార్డుతో సహా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.. 2018 లోనే ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది ..2012 నుండి 2016 వరకు ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో స్థానం దక్కించుకుంది… ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె అయిన ఈమె సంజయ్ లీల భన్సాలీ 2005లో దర్శకత్వం వహించిన బ్లాక్ అనే సినిమాకి సహాయ దర్శకురాలిగా పనిచేసి.. తన కెరియర్ ను మొదలు పెట్టింది. అదే భన్సాలీ దర్శకత్వంలో 2007 లో వచ్చిన సావరియా సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో నటించినందుకు గానూ ఉత్తమ డెబ్యూ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.. ఇక మూడు సంవత్సరాల తర్వాత 2010లో హేట్ లవ్ స్టోరీ సినిమాతో మొదటి కమర్షియల్ సక్సెస్ అందుకుంది.. ఇక తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా నటించి మంచి పేరు సొంతం చేసుకుంది సోనమ్ కపూర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు