29Years For Gharana Bullodu : ‘ఘరానా బుల్లోడి’ జట్కా దెబ్బ కి 29 ఏళ్లు..

29Years For Gharana Bullodu : అక్కినేని నాగార్జున వరుస హిట్లతో దుమ్ములేపుతున్న టైం అది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా అప్పటికీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆ సమయంలో కింగ్ నాగార్జున రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన చిత్రం ఘరానా బుల్లోడు.. అంతకు ముందే వీళ్ళ కాంబోలో జానకి రాముడు, ఆఖరి పోరాటం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇక వీళ్ళ కాంబోలో సినిమా అంటే ఆ రోజుల్లో అభిమానుల అంచనాలు పరిధిని దాటిపోయాయి. ప్రముఖ నిర్మాత కృష్ణ మోహన్ రావు నిర్మాణంలో వచ్చిన ఘరానా బుల్లోడు కి వి. విజయేంద్ర ప్రసాద్ కథని అందించడం విశేషం. అలా 1995 ఏప్రిల్ 27న నాగార్జున నటించిన ఘరానా బుల్లోడు థియేటర్లలో విడుదలై దుమ్ము లేపింది. “జట్కా రాజు కొరడా విసిరితే ఎలాంటోళ్లకైనా సుర్రు సుమ్మైపోద్ది”. అందుకే ఆ రోజుల్లో జట్కా రాజుగా నాగార్జున దెబ్బకు బాక్సాఫీసుకు కూడా సుర్రు సుమ్మైపోయింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. నేటికీ (29 Years For Gharana Bullodu) ఈ సినిమా విడుదలై 29 ఏళ్ళు పూర్తయింది.

నాగ్ మాస్ కామెడీతో.. సుర్రు సుమ్మైపోయింది..

ఇక యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరో నటించిన చిత్రం ‘ఘరానా బుల్లోడు’. ఈ సినిమాలో జట్కా రాజు పాత్రలో ఆయన కనిపించారు. అప్పట్లో స్టార్ హీరోలకు ఒక్కో సినిమాలో ఒక్కో ఫేమస్ డైలాగు ఉండేది. ఆ హీరో మ్యానరిజంకు తగ్గట్టు ఆ డైలాగ్స్ పెట్టేవారు. అలాగే ‘ఘరానా బుల్లోడు’లో నాగార్జునకు అంతే.. ‘సుర్రు సుమ్మైపోద్ది’ డైలాగ్‌ను పెట్టారు. ఇది జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఘరానా బుల్లోడు చిత్రం అప్పట్లోనే 20 కేంద్రాల్లో 100 రోజులు పూర్తిచేసుకుంది. ఆర్‌కే ఫిలింస్ అసోసియేట్స్ బ్యానర్‌పై కె.కృష్ణమోహనరావు నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, ఆమని హీరోయిన్లుగా నటించారు. జయంతి, సుధ, మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుధాకర్, తనికెళ్ల భరణి, మహేష్ ఆనంద్, శ్రీహరి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నూతన ప్రసాద్ అతిథి పాత్రలో కనిపించారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమా విడుదలై నేటికి 29 సంవత్సరాలు పూర్తయ్యింది.

కుర్రకారుని కిక్కెకించిన పాటల పల్లకి..

ఇక నాగార్జున కి అప్పట్లో యూత్ లో ఉన్న ఫాలోయింగ్ కి సాంగ్స్ కోసం కూడా మంచి డిమాండ్ ఉండేది. ఇక రాఘవేంద్ర రావు సినిమా పాటలంటే ఎలా ఉంటాయో తెలిసిందే. లెజెండరీ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా, ఆయన స్వరపరిచిన పాటలన్నీ అప్పట్లో సూపర్ హిట్. ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాలోని పాటలను వింటూనే ఉంటారు. ‘భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా’, ‘సై సై సయ్యారే’, ‘వంగి వంగి దండమెట్టు’ వంటి పాటలు బాగా పాపులర్. ఇక ఈ సినిమాలోని పాటలను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర ఆలపించారు. అప్పట్లో ఈ చిత్ర (29Years For Gharana Bullodu) శతదినోత్సవ వేడుకలను 1995 ఆగస్టు 4న విజయవాడలో అక్కినేని అభిమాన సంఘం ఆధ్వర్యంలో శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక అక్కినేని ఫ్యాన్స్ ఘరానా బుల్లోడు నాగ చైతన్య రీమేక్ చేయాలనీ ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు