34Years For NariNari NadumaMurari : బాలయ్య 50వ చిత్రానికి 34ఏళ్లు… ఒక్క ఫైట్ కూడా లేని ఎంటర్టైనర్

34Years For NariNari NadumaMurari : తెలుగు చిత్ర పరిశ్రమ రెండో తరం అగ్ర కథానాయకులలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ సినిమా అంటే టాలీవుడ్ లో భారీ డైలాగులు, హై వోల్టేజ్ ఫైట్ సీన్స్, తో పాటు మాస్ స్టెప్పులు ఉంటాయని తెలిసిందే. ఈ మూడింటిలో ఏది ఏది తక్కువైనా కూడా అభిమానులు సైతం ఒప్పుకోరు. ఈ తంతు బాలయ్య కెరీర్ బిగినింగ్ నుండి వస్తుంది. మాస్, క్లాస్ అనే తేడా ల్లేకుండా అన్ని వర్గాల ఫ్యాన్స్ అభిమానాన్ని పొందుతున్న హీరోగా బాలకృష్ణ తన సినిమాలతో ఇప్పటికి అభిమానులను అలరిస్తూనే ఉంటాడు. ఇప్పటికే హ్యాట్రిక్ సక్సెస్ లో ఉన్న బాలయ్యతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బాలకృష్ణ నటించిన ఏ సినిమా అయినా అది బాలయ్య మార్క్ లో ఉంటుందే తప్ప సరికొత్తగా ఉండదు. ఒకవేళ కథా, కథనాలు కొత్తగా ఉన్నా, బాలయ్యని దర్శకులు చూపించే తీరు మాత్రం ఒకేలా ఉంటుంది. ఏదో అక్కడక్కడా ఆదిత్య 369 వంటి ప్రయోగాత్మక సినిమాల్లో తప్ప బాలయ్య ప్రతి సినిమాలో కూడా ఏదో ఒకచోట భారీ ఫైట్ గాని, డైలాగ్స్ గాని ఉంటాయి. అయితే బాలకృష్ణ నటించిన ఆ ఒక్క సినిమాలో మాత్రం ఒక్క ఫైట్ కూడా ఉండదు, పంచ్ డైలాగ్స్ ఉండవు. అన్నిటికీ మించి బాలకృష్ణ డాన్సులు కూడా ఆ సినిమాలో ఉండవు. అలాంటి ప్రయోగం చేసిన సినిమా ఆడలేదా? అంటే బాలయ్య కెరీర్ లోనే క్లాసిక్ హిట్ గా నిలిచిన చిత్రమిది. అదే నారి నారి నడుమ మురారి. ఈ చిత్రం విడుదలై నేటికీ 34 (27 ఏప్రిల్ 1990) వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఆ చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం..

బాలకృష్ణ 50వ చిత్రంగా నారి నారి నడుమ మురారి..

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 50 వ చిత్రంగా తెరకెక్కిన ల్యాండ్ మార్క్ మూవీ “నారి నారి నడుమ మురారి”(34Years For NariNari NadumaMurari). బాలయ్య హీరోగా నటించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా ఒకటని చెప్పవచ్చు. ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం, యువచిత్ర పతాకం బ్యానర్ పై తెరకెక్కగా ఈ సినిమాకు మురారి నిర్మాతగా వ్యవహరించారు. విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా కథ అందించిన ఈ చిత్రం లో శోభన, నిరోషా హీరోయిన్లుగా నటించగా, 1990 సంవత్సరంలో ఏప్రిల్ నెల 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

బాలకృష్ణ నటనా చాతుర్యంతో..

ఇక బాలకృష్ణ నటించిన నారి నారి నడుమ మురారి చిత్రం లో బాలకృష్ణ మార్క్ తో ఒక్క ఫైట్ గాని, ఒక్క డాన్స్ గాని, భారీ డైలాగ్స్ కానీ ఉండవు. అయినా సరే బాలయ్య నటనతో చక్కటి కుటుంబ ప్రేమ కథా చిత్రాల భావోద్వేగాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. బాలకృష్ణ నటన, కథ తో పాటు కోదండరామిరెడ్డి స్క్రీన్ ప్లే తో మంచి ఫీల్ గుడ్ లవ్ డ్రామాగా సినిమా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో అత్తా అల్లుళ్ల టీజింగ్ డ్రామా కామెడీ మరో హైలెట్ అని చెప్పొచ్చు. ఇక నారి నారి నడుమ మురారి చిత్రం టీవీలో ప్రసారమైతే ఇప్పటికీ మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.ఫైట్లు, డ్యాన్స్ స్టెప్పులు లేకపోయినా బాలయ్య మాత్రం బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు