Balakrishna : రెమ్యూనరేషన్ డబుల్ చేసిన బాలయ్య.. రిస్క్ అంటున్న ట్రేడ్ పండితులు?

Balakrishna : టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. రెండున్నరేళ్ల ముందు వరకు బాలకృష్ణ హిట్ కోసం చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. కనీసం మిడ్ రేంజ్ హీరోలను కూడా దాటలేకపోయాడు. కానీ అఖండ తో ఒక్క సరిగా ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఈ సినిమా ఎంత భారీ బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందేగా. పైగా ఏదేదో గాలివాటం అని కాకుండా ఆ వెంటనే వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మళ్ళీ వరుస సక్సెస్ లని అందుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్నాడని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ లోనే పీక్ క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్న బాలకృష్ణ (Balakrishna) అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మూడు సార్లు 100 కోట్ల వసూళ్లను అందుకున్నాడు.

రెమ్యూనరేషన్ డబుల్ చేసిన బాలయ్య..

వరుస హ్యాట్రిక్ హిట్లతో సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య ఇప్పుడు తన రెమ్యునరేషన్ ని మరింతగా పెంచేశాడు అంటూ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా బజ్ అయితే వినిపిస్తుంది. బాలయ్య అఖండ ముందు వరకు తీసుకునే రెమ్యునరేషన్ చాలా తక్కువగానే ఉండగా, ప్లాప్ అయితే 10 కోట్ల లోపే తీసుకునేవాడట. ఇప్పుడు హాట్రిక్ మూవీస్ తో ఆడియన్స్ ను మెప్పించిన బాలయ్య ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ కి ఏకంగా 20 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని స్ట్రాంగ్ గా టాక్ ఉంది. కొంతమంది అయితే పాతిక కోట్ల వరకు బాలయ్య వెళ్లాడని అంటున్నారు. తన అప్ కమింగ్ మూవీస్ కూడా ఫుల్ ప్రామిసింగ్ గా ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంటే ఖచ్చితంగా బాలయ్య రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

రిస్క్ అంటున్న ట్రేడ్ పండితులు?

అయితే నందమూరి బాలకృష్ణ సినిమాలు హిట్ అయితే ఒకే గాని ప్లాప్ అయితే భారీ నష్టాలు తెస్తాయని డిస్ట్రిబ్యూటర్స్ నుండి బయ్యర్ల దాకా అంటారు. అందుకే ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ కరెక్ట్ కాదని 15 కోట్ల వరకైతే ప్రస్తుతానికి బాలయ్య మార్కెట్ కి కరెక్ట్ అని అంటున్నారు. ఇక బాబీతో భారీ యాక్షన్ మూవీ చేస్తున్న నట సింహం బాలకృష్ణ ఆ సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ పెంచొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. తాజా సమాచారం ప్రకారం సినిమా కి కూడా భారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటూ ఉండగా, ఆ తర్వాత సినిమాలకు కూడా 20 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడట. ఇక హాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య చేయబోయే సినిమాలతో ఎలాంటి కలెక్షన్స్ కొల్లగొడతాడో చూడాలి. ప్రస్తుతం టిడిపి తరపున ఎలెక్షన్ల ప్రచారం లో ఉన్న బాలయ్య మరో మూడు వారాల తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు