PushpaTheRule : విజిల్ పోడు రికార్డ్ ని టార్గెట్ చేసిన పుష్ప ఫస్ట్ సాంగ్? రికార్డులు బద్దలవుతాయా?

PushpaTheRule :టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో “పుష్ప ది రూల్” సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా పుష్ప పేరుతోనే ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ రాబోతున్న సినిమాల్లో భారీ హైప్ తో పాటు మినిమం రికార్డ్ బ్రేకింగ్ హైప్ ఉంది పుష్ప 2 సినిమాకే. మొదటి సినిమాకి పది రెట్ల రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్ రేంజ్ హైప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రేంజ్ లో పలు రికార్డులు కూడా తిరగరాస్తూ ఉంది. ఇక ఈ మధ్యే అల్లు అర్జున్ బర్త్ డే టీజర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇక పాన్ ఇండియా వైడ్ గా ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న పుష్ప ది రూల్ నుండి ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్ రాబోతుంది. ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే ఈ పాట మే డే రోజున 1న రిలీజ్ కాబోతుంది. ఇక మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజీ రెస్పాన్స్ వలన పార్ట్ 2 పై అంచనాలు మరో లెవల్ లో ఉండగా, సినిమా నుండి వచ్చిన టీజర్ ఆల్రెడీ సెన్సేషన్ ని క్రియేట్ చేయగా, ఇప్పుడు సాంగ్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో అని ఎదురుచూస్తున్నారు.

పుష్ప టైటిల్ సాంగ్ ముందున్న రికార్డ్స్ ఇవే!

అయితే అల్లు అర్జున్ లాస్ట్ రెండు సినిమాలు ఆడియో పరంగా సూపర్ డూపర్ హిట్ గా నిలవగా, యూట్యూబ్ లో రికార్డుల వర్షం కురిపించాయి. ఇలాంటి టైంలో పుష్ప2 (PushpaTheRule) నుండి వస్తున్న టైటిల్ సాంగ్ మీద హైప్ సాలిడ్ గా ఉండగా, ఈ పాట యూట్యూబ్ లో బ్రేక్ చేయాల్సిన రికార్డులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ పరంగా చూసుకుంటే 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను గుంటూరు కారం లోని ధమ్ మసాలా సాంగ్ 17.42 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ ను అందుకోగా, లైక్స్ పరంగా సర్కారు వారు పాట లోని కళావతి సాంగ్ 806.3K లైక్స్ తో రికార్డ్ హోల్డర్ గా ఉంది. ఈ రికార్డులు బ్రేక్ అవ్వడానికి అవకాశం ఎంతైనా ఉండగా, సౌత్ ఇండియా పరంగా అయితే రికార్డ్ పెద్దగా ఉందని చెప్పాలి. సౌత్ ఇండియా పరంగా దళపతి విజయ్ నటించిన గోట్ మూవీ లోని ‘విజిల్ పోడు’ సాంగ్ 24.88 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ హోల్డర్ గా ఉండగా లైక్స్ పరంగా విజయ్ బీస్ట్ మూవీ లోని అరబిక్ కుత్తు సాంగ్ 2.2 మిలియన్ లైక్స్ తో టాప్ లో ఉంది.

ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టే అవకాశం..

అయితే పుష్ప2 టైటిల్ సాంగ్ సౌత్ పరంగా కొత్త రికార్డుల విషయంలో కాస్త అనుమానమే అయినా, టాలీవుడ్ పరంగా రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. సౌత్ రికార్డ్ మాత్రం బిగ్గెస్ట్ టార్గెట్ అనే చెప్పాలి. కానీ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇప్పుడు పుష్ప 2 కి ఉన్న హైప్ తో ఏదైనా మ్యాజిక్ జరగొచ్చు. ఇక పుష్ప 2 సాంగ్ మే 1 న రిలీజ్ కాబోతుండగా, సోషల్ మీడియా లో ఇప్పటినుండే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక పుష్ప ది రూల్ 1000 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అవుతుందన్న సంగతి తెలిసిందే. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కంటెంట్ బాగుంటే అంతకు మించి భారీ వసూళ్లు అందుకునే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు