Kalki 2898AD: మామ కోసం అల్లుడు కాంప్రమైజ్ అవుతారా..?

Kalki 2898AD: తెలుగు ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. తన కెరియర్లో చేసింది రెండు సినిమాలే అయినా వాటికోసం తను ఎంచుకున్న కథలు, నటీనటుల విషయాలను చూస్తే ఖచ్చితంగా నాగ్ అశ్విన్ స్టార్ డైరెక్టర్ అయ్యే లక్షణాలు ఎక్కువగానే కనిపిస్తాయి. అందుకే ఈసారి ఏకంగా ప్రభాస్ తో సినిమాని తెరకెక్కించే అవకాశాన్ని అందుకున్నారు. అలా కల్కి 2898AD అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో స్టార్ కాస్ట్యూమ్స్ కూడా నటిస్తూ ఉండడం జరుగుతోంది.

Kalki 2898AD: Will son-in-law compromise for uncle..?
Kalki 2898AD: Will son-in-law compromise for uncle..?

నాగ్ అశ్విన్ సినిమాలు..

భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్.. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలను తెరకెక్కించిన వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా మంచి లాభాలు రాబట్టడమే కాకుండా జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు మరొకసారి కల్కి చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

అల్లుడు పై నమ్మకంతో..

నాగ్ అశ్విన్ మొదట చేసిన రెండు చిత్రాలకు రెమ్యూనరేషన్ భారీగానే తీసుకున్నారు. 2015లో అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. తనకు ఎన్నో సినిమాలు చేయడానికి ఆఫర్స్ వచ్చినా నాగ్ అశ్విన్ మాత్రం చేయడం లేదు.. ముఖ్యంగా తన మామయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకు వెళ్లేందుకే తను విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక అశ్వని దత్ కూడా తన అల్లుడు మీద నమ్మకం ఉంచి కల్కి సినిమా ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -

భారీ బడ్జెట్ తో నిర్మాణం..

కల్కి సినిమా పై ఏకంగా 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో నటిస్తున్న నటీనటుల విషయానికి వస్తే.. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, కమలహాసన్ తదితర స్టార్ కాస్టింగ్ , టెక్నీషియన్స్ ను కలుపుకొని సుమారుగా రూ.250 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.. అయితే నాగ్ అశ్విన్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదట.. కేవలం ఈ చిత్రం సక్సెస్ అయి వచ్చే లాభాలలో వాటా మాత్రమే తీసుకునేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

రెమ్యునరేషన్ కాదు లాభాల్లో వాటా..

ఒకవేళ ఈ డీల్ ప్రకారం నాగ్ అశ్విన్ కల్కి చిత్రానికి మొదటి రోజే రూ .70 కోట్ల గ్రాస్ కు పైగా ఆదాయం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బిజినెస్ పెరిగితే మరింత లాభాలు వచ్చే అవకాశం కూడా ఉన్నదట. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే రాజమౌళి తర్వాత మళ్లీ అంతటి రెమ్యూనరేషన్ అందుకునేది ఈ డైరెక్టర్ మాత్రమే అని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఏది నిజమో చూడాలి మరి. మొత్తానికైతే రెమ్యునరేషన్ తీసుకోకుండా మామ కోసం కాంప్రమైజ్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు