Adah Sharma Bastar: ఓటీటీ లోకి రాబోతున్న బస్తర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Adah Sharma Bastar.. ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న విషయం తెలిసిందే.. థియేటర్లలో సినిమా చూడడం మిస్సయిన వారు ఓటీటీలో సినిమా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే పలు రకాల జానర్లలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను టీవీలకే కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీ లలో ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించే సినిమాలు యాక్షన్, థ్రిల్లర్, హార్రర్ , ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అదే జానర్ లో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పలు చిత్రాలలో హీరోయిన్గా గ్లామర్ రోల్స్ తో ఆకట్టుకున్న ఆదాశర్మ తాజాగా ది కేరళ స్టోరీ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇందులో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Adah Sharma Bastar: When is Bastar coming to OTT streaming..?
Adah Sharma Bastar: When is Bastar coming to OTT streaming..?

బస్తర్ స్ట్రీమింగ్ అప్పుడే..

ఇప్పుడు వెంటనే కేరళ స్టోరీ టీం తో మరో ప్రాజెక్టుగా బస్తర్ సినిమా తీసింది ఈ ముద్దుగుమ్మ.. డైరెక్టర్ సుదీప్తోసేన్ ఎంతో రీసెర్చ్ చేసి ఆ తర్వాత తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 15వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లను సాధించలేకపోయింది.. దీంతో ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది ఈ సినిమా. ఈ మేరకు ప్రముఖ తెలుగు జీ 5 ఓటిటి ఫ్లాట్ ఫామ్ మే 17న స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాని హిందీతో పాటు తెలుగులో కూడా మే 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తామంటూ చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే..

బస్తర్ సినిమా కథ..

ఈ సినిమా కథ విషయానికొస్తే.. దట్టమైన అడవులలో నక్సల్స్ సృష్టించే హింసకు అడ్డుకట్ట వేయడానికి వచ్చిన ఐఏఎస్ అధికారి పాత్రలో ఈమె కనిపించి అందరిని ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా వివాదాస్పదంగా మారింది. బస్తర్ జిల్లాలో నక్సల్స్ కి ఇండియన్ ఆర్మీకి మధ్య పరస్పరం కాల్పులు జరుగుతూ ఉండడం రెడ్ కారిడార్ లో భాగమైన ఈ ప్రాంతంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా మారింది.. కానీ ఇవన్నీ వివాదాస్పదంగా మారడం గమనార్హం.. ఇక్కడ అందర్నీ ఆలోచింపచేసే అంశం ఏమిటంటే పాకిస్తాన్ తో జరిగిన నాలుగు యుద్ధాలలో చనిపోయిన మన భారతీయ సైనికుల కంటే ఈ మావోయిస్టులు చంపిన సైనికుల సంఖ్య రెట్టింపుగా ఉందని.. అక్కడ చెప్పే డైలాగ్ లు కూడా మనల్ని ఆలోచింపచేస్తాయి .. కాకపోతే కథపరంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది కానీ ఎందుకో ప్రేక్షకులను కట్టిపడేయలేకపోయింది.. అందుకే ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.. మరి ఓటిటి లోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుంది..? ఎలాంటి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుంది ? అన్నది ఆసక్తి మారింది.. సాధారణంగా థియేటర్లలో విజయం సాధించని చాలా సినిమాలు ఓటీటీ లలో మంచి రేటింగ్తో దూసుకుపోతూ ఉంటాయి.. మరి ఇలాంటి ఒక రికార్డు ఈమె ఓటీటీ ద్వారా సృష్టిస్తుందా ? లేదా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు