Actress Devayani Sharma : హ్యాకర్ల వల్ల రాత్రి నిద్ర పట్టలేదు… అంటూ ఫోన్ హ్యాక్ అయిన విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్

Actress Devayani Sharma : ఆన్‌లైన్‌లో రోజురోజుకూ వేధింపులకు గురవుతున్న మహిళలు, ముఖ్యంగా సినీ తారల లిస్ట్ పెరిగిపోవడం ఆందోళనకరంగా మారింది. ట్రోల్స్‌తో పాటు హీరోయిన్ల ఫోటోలను ఉపయోగించి వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన కామెంట్స్, ఫేక్ ఫోటోలు, వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ అయ్యాయి. చాలా మంది హీరోయిన్లు ఈ ఆన్‌లైన్ హింసకు గురవుతున్నారు. ఇప్పుడు దేవయాని శర్మ కూడా అలాంటి కష్టాన్నే ఎదుర్కొంటోంది. సైబర్ నేరగాళ్లు దేవయాని మొబైల్‌ను హ్యాక్ చేసి, ఆమె వ్యక్తిగత సమాచారంతో పాటే ఫోటోలను దొంగిలించినట్లు తెలుస్తోంది.

మొబైల్ ను హ్యాక్ చేశారంటూ పోస్ట్..

ఫోన్ హ్యాక్ కు గురైందన్న విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేసింది దేవయాని శర్మ. అందులో ‘కొద్ది రోజుల క్రితం నా మొబైల్‌ని ఎవరో హ్యాక్ చేశారు లేదా క్లోన్ చేశారు. నా మొబైల్‌లోని నా ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించారు. నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి లేదా నన్ను భయపెట్టడానికి ఇలా చేశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నా వాట్సాప్ మళ్లీ హ్యాక్ అయ్యింది. నా మొబైల్ సెట్టింగ్‌లు మార్చారు. నా మొబైల్ ఫోన్ మునుపటిలా లేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని దేవయాని శర్మ అన్నారు.

రాత్రంతా నిద్ర లేదు..

ఇంకా ఆ పోస్ట్ లో “నా మొబైల్ ఫోన్‌ని ఉపయోగించి ఎవరికైనా మెసేజ్ పంపించారా లేదా అనే విషయం నాకు తెలియదు. ఎవరికైనా నా ఫోన్ నుంచి ఏదైనా మెసేజ్ వస్తే దయచేసి దానిని ఇగ్నోర్ చేయండి. నేను మీకు మెసేజ్ చేయలేదు. ఈ ఊహించని పరిణామంతో నా మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింది. రాత్రి నిద్ర లేదు. ముంబైలోని సైబర్ క్రైమ్ పోలీసులకు మూడుసార్లు ఫిర్యాదు చేశాను. వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తారన్న నమ్మకం ఉంది’ అని అన్నారు.

- Advertisement -

కెరీర్ ను నాశనం చేయడానికే ఇలాంటి పని..

నా మొబైల్ నంబర్ నుండి ఎవరికైనా వింత సందేశాలు వస్తున్నట్లయితే, దానిని ఇగ్నోర్ చేయండి. నేను ఇప్పటికే ఈ సమస్యతో పోరాడుతున్నాను. త్వరలోనే ఈ హ్యాకింగ్ సమస్యను పరిష్కరిస్తాను. నా పేరు చెడగొట్టడం, నా కెరీర్‌ను చెడగొట్టడం అనే స్పష్టమైన ఉద్దేశ్యంతోనే ఇలాంటి పని చేశారని నేను అనుకుంటున్నాను. ఒక ఆర్టిస్ట్ జీవితం కఠినమైనది, ఇలాంటి సంఘటనలు వారి జీవితాన్ని మరింత కఠినతరం చేస్తాయి. వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి బయటపడతానన్న నమ్మకం ఉంది’ అని దేవయాని అన్నారు.

దేవయాని తెలుగు సినిమాలు..

దేవయాని శర్మ తెలుగులో ‘అనగనగా’, ‘రొమాంటిక్’ అనే సినిమాల్లో బోల్డ్‌ రోల్స్ లో కనిపించింది. రీసెంట్ హిట్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ కూడా నటించింది. ఇటీవల విడుదలైన సైతాన్ అనే బ్లాక్ బస్టర్ హారర్ మూవీలో కూడా ఆమె నటించింది. జ్యోతిక, మాధవన్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీలో దేవయాని కీలక పాత్రను పోషించి, తన నటనకు ప్రశంసలు అందుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు