Game of Thrones Star Ian Gelder Dies : గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ సీనియర్ నటుడి కన్నుమూత… ఎలా చనిపోయాడంటే?

గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో లన్నిస్టర్ పాత్ర పోషించిన ప్రముఖ బ్రిటిష్ నటుడు ఇయాన్ గెల్డర్ కన్నుమూశారు. 74 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. గెల్డర్ మరణాన్ని అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ వార్త తెలియగానే హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. మీడియా కథనాల ప్రకారం ఇయాన్ గత ఐదు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. క్యాన్సర్ తో పోరాటం చేస్తూనే సోమవారం ఈ లోకానికి ఆయన వీడ్కోలు పలికాడు.

ఇయాన్ పార్టనర్ ఎమోషనల్ పోస్ట్..

ఇయాన్ గెల్డర్ పార్టనర్, సహ నటుడు బెన్ డేనియల్స్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అతని మరణాన్ని ధృవీకరించారు. ఈ  విషయాన్ని తెలియజేస్తూ ఆయన సుధీర్ఘ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ‘ఇయాన్ గెల్డర్ గత ఐదు నెలలుగా పిత్త వాహిక క్యాన్సర్‌ (bile duct cancer)తో పోరాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేడని చాలా బాధతో, బరువెక్కిన హృదయంతో చెప్తున్నాను. డిసెంబర్‌లో క్యాన్సర్‌ నిర్ధారణ కాగా, ఆ వ్యాధితో బాధపడుతూ గెల్డర్ సోమవారం మరణించాడు. తన బాగోగులు చూసుకోవడానికి అన్ని పనులు వదిలేశాను. కానీ ఆయన ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లిపోతాడని అనుకోలేదు” అంటూ ఇన్స్టా లో చేసిన సుధీర్ఘ పోస్ట్ లో రాసుకొచ్చారు బెన్.

బెన్ డేనియల్స్ ఇంకా ఇలా రాసుకొచ్చాడు. ‘గెల్డర్ తన అనారోగ్యాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అతను దయగల, ఉదారమైన, ప్రేమగల వ్యక్తి. అతని యాక్టింగ్ స్కిల్స్ కు స్టార్స్ కూడా ముగ్ధులయ్యారు” అంటూ బెన్ తన పార్టనర్ మృతిపై ఎమోషనల్ అయ్యారు.

- Advertisement -

ఇయాన్ నటించిన సిరీస్‌ లు

కాగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఐదు సిరీస్‌లలో ఇయాన్ గెల్డర్ నటించారు. ఈ సిరీస్ 8 సీజన్లుగా రాగా, అందులో 5 సీజన్లలో ఆయన భాగం అయ్యారు. ఇందులో క్రూరమైన లార్డ్ టైవిన్ లన్నిస్టర్ తమ్ముడు, నమ్మకమైన సలహాదారుగా నటించాడు. అయితే “గేమ్ ఆఫ్ థ్రోన్స్”లో అతని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. పాపులారిటీ మరింతగా పెరిగిపోయింది. ‘ఫాదర్ బ్రౌన్’ వెబ్ సిరీస్‌లో కూడా కనిపించాడు. గెల్డర్ టార్చ్‌వుడ్, హిస్ డార్క్ మెటీరియల్స్, డాక్టర్ హూ, స్నాచ్, ది బిల్ వంటి మరెన్నో అద్భుతమైన పాత్రల్లో, సిరీస్ లు సినిమాల్లో కనిపించాడు.

ఇయాన్ చివరి షో ఇదే..

ఇయాన్ గెల్డర్ థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా పని చేశాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మరపురాని చిత్రాలల్లో నటించాడు. 1978లో వచ్చిన ‘ది త్రీ కిస్సెస్’ సినిమాతో ఆయనకు గుర్తింపు వచ్చింది. సినిమాలకు ముందు అతను టీవీ షోలలో పని చేసేవాడు. ఆయన చివరిగా ‘ఫాదర్ బ్రౌన్’ అనే టీవీ షోలో కనిపించాడు. ఇక గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధ పడుతున్న ఇయాన్ తాజాగా అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

ఇక ఇయాన్ మృతి గురించి తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్, ఆయనతో కలిసి పని చేసిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు