Jahnvi Kapoor: అక్కడే పెళ్లి చేసుకోబోతున్న జాన్వి ?

Jahnvi Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలు అయిన… టాలీవుడ్ ఇండస్ట్రీలో అయినా… ఎక్కడ చూసిన హీరోయిన్లకు మాత్రం కొదవలేదు. కుప్పలు కుప్పలుగా హీరోయిన్లు పుట్టుకొస్తున్నారు. ఒకరిని మించిన ఒకరు అన్నట్లుగా ఛాన్సులు కొట్టేస్తున్నారు హీరోయిన్లు. కొంతమంది తమ సొంత కాళ్లపై కష్టపడి ఇండస్ట్రీలో ఎదుగుతుంటే… మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం… వారసత్వాన్ని అందుపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణించేవారు చాలామంది ఉన్నారు. ఇలా హీరోలు ఎక్కువగా వస్తూ ఉంటారు. హీరోయిన్లు కూడా అప్పుడప్పుడు వస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ జాన్వి కపూర్ ఒకరు. హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలనాటి సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. చేసిన కొన్ని సినిమాలు అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించింది హీరోయిన్ జాన్వి కపూర్.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురు గానే ఇప్పటికీ హీరోయిన్ జాన్వి కపూర్ ను చూస్తున్నారు. తనకంటూ ఇప్పటివరకు హీరోయిన్ జాన్వి కపూర్ మంచి స్టార్డం తెచ్చుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో నేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెడుతోంది ఈ బ్యూటీ. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా కూడా షూటింగ్ చివరి దశకు వచ్చింది.

- Advertisement -

ఈ సినిమాను దసరా తర్వాత రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందట హీరోయిన్ జాన్వి కపూర్. ఇదంతా పక్కకు పెడితే… ప్రస్తుతం హీరోయిన్ జాన్వి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిసారి తన బాయ్ ఫ్రెండ్ తో తిరుమల శ్రీవారి సన్నిధిలో.. లేదా ఇతర ప్లేసుల్లో కనిపిస్తూ ఉంటుంది హీరోయిన్ జాన్వి కపూర్. అయితే ఈ బ్యూటీ తన వివాహాన్ని తిరుమలలో చేసుకునేందుకు సిద్ధమయ్యారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా జాన్వి కపూర్… శిఖర్ పహారియన్ ను ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు