Tollywood : ఒక్క సినిమా థియేటర్లలో లేక రీ రిలీజ్ సినిమాలేసుకునే పరిస్థితి?

Tollywood : టాలీవుడ్ లో ఈ ఇయర్ సమ్మర్ బోసి పోతుంది. సమ్మర్ ఆరంభంలోనే ఫ్యామిలీ స్టార్ వంటి డిజాస్టర్ తో నీరు గార్చేసిన టాలీవుడ్ మేకర్స్ ఆ తర్వాత కూడా ఇప్పటివరకు కూడా ఒక్క సరైన సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తేలేకపోతున్నారు. ఒక పక్క ఇతర భాషల్లో నెలకో రెండు మూడు బ్లాక్ బస్టర్ సినిమాలతో రచ్చ చేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం నాసిరకం సినిమాలు తీస్తూ తెలుగు ఆడియన్స్ కి విసుగు తెప్పిస్తున్నారు. కనీసం చిన్న సినిమాలైనా ఏమైనా ఆకట్టుకుంటాయా అంటే అవి మరింత దారుణంగా తయారయ్యాయి. అప్పుడెప్పుడో నెల రోజుల ముందు టిల్లు స్క్వేర్ తో టాలీవుడ్ కి ఓ హిట్టు బొమ్మ పడింది. మళ్ళీ ఇప్పటివరకూ ఒక్క హిట్ సినిమా లేదు. లాస్ట్ వీక్ కూడా అన్ని చిన్న సినిమాలు రిలీజ్ కాగా అవి చిన్న సినిమాల్లా కాకుండా చెత్త సినిమాల రేంజ్ లో పెర్ఫార్మ్ చేసాయి. ఈ వారం అయితే అసలు తెలుగు సినిమాల ఊసే లేకుండా పోయింది.

ఒక్క తెలుగు సినిమా లేదు..

ఇక టాలీవుడ్ (Tollywood) లో ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా, అనూహ్యంగా అందులో రెండు వాయిదా పడి ఒకటే రిలీజ్ అయింది. విశాల్ రత్నం మాత్రమే రిలీజ్ అయింది. పోనీ ఏదైనా ఆకట్టుకుంటుందా అంటే, విశాల్ గత సినెమాలన్నిటిని మిక్స్ చేసి అరవ టెస్టుతో సినిమాని దించేశారు. ఆ సినిమాని చూడడం కన్నా, బోయపాటి పాత సినిమాలు ఇంట్లో వేసుకుని చూడడం బెటర్ అంటున్నారు జనాలు. నిజానికి ఈ వారం ప్రతినిధి 2 రిలీజ్ కావాల్సి ఉండగా, ఆ సినిమాని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాయిదా వేశామని అంటున్నా, పొలిటికల్ ఇబ్బందుల వలెనే వాయిదా పడిందని ఎవ్వరైనా చెప్పగలరు. ఏది ఏమైనా నెలరోజులుగా టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాల్లేక ఆకలి మీదున్నారని చెప్పొచ్చు. కొంత మంది ఓటిటి సినిమాలను చూసి సంతృప్తి పడుతున్నా, చాలా మంది ప్రేక్షకులకు థియేటర్ ఎక్స్పీరియెన్స్ లేనిదే సంతృప్తి ఉండదు.

సినిమాలేదని రీ రిలీజ్ సినిమాలేసుకుంటున్నారు..

గత కొన్ని రోజులుగా ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల్ని సంతృప్తి పరచలేదని ఇప్పుడు పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇక మే 3న పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రీ రిలీజ్ కాబోతుంది. అలాగే మే 1 న ప్రభుదేవా క్లాసిక్ మూవీ ప్రేమికుడు రీ రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ మధ్య రీ రిలీజ్ అయిన హ్యాపీ డేస్ థియేటర్లలో ఇంకా ఆడుతుంది. త్వరలో ఎన్టీఆర్ ఆది కూడా రీ రిలీజ్ కాబోతుంది. ఇవన్నీ చూస్తుంటే, థియేటర్లలో ఒక్క సినిమా లేక రీ రిలీజ్ సినిమాలు కావాలని వేయించుకుంటున్నట్టు ఉంది. మరి తెలుగు దర్శక నిర్మాతలు సోలో రిలీజ్ కావాలని మంచి సీజన్ ని మిస్ చేసుకుని వాయిదాల పర్వం కొనసాగిస్తారా? లేక ఇప్పుడైనా తేరుకుని వరుస సినిమాలను రిలీజ్ చేస్తారా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు