Bhanupriya: ఆ జ్ఞాపకం ఎప్పటికీ మరువనిది..!

Bhanupriya.. వినీల ఆకాశంలో ఒక వెలుగు వెలిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అలనాటి సీనియర్ హీరోయిన్ అందాల తార భానుప్రియ ఇప్పటికీ ఎవర్గ్రీన్ నటిగా నిలిచిపోయింది. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సెటిల్ అయిపోయింది.. సితార అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన భానుప్రియ తన అంద చందాలతో యువతను ఆకట్టుకుంది.. అంతే కాదు ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్.. భానుప్రియ స్ఫూర్తితో కాళ్లకు గజ్జలు కట్టిన వారు ఎంతోమంది.. మొట్టమొదటి సినిమాతోనే మార్కెట్లో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న భానుప్రియ ఆ తర్వాత కొన్నేళ్లపాటు వెను తిరిగి చూడలేదు.. ఇప్పటికీ యాక్టివ్గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. ఇదిలా ఉండగా సితార సినిమా గురించి.. అందులో చీర గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు డైరెక్టర్ వంశీ

Bhanupriya: That memory will never be forgotten..!
Bhanupriya: That memory will never be forgotten..!

ఆ జ్ఞాపకం ఎప్పటికీ మరువనిది..

డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ.. సితార సినిమా విజయం సాధించడంతో నా ఆనందానికి అవధులు లేవు.. ఒకరోజు నేను ఏడిద నాగేశ్వరరావు ఇంట్లో ఉండగా భానుప్రియ ఫోన్ చేశారు.. అక్కడ ఎవరూ లేకపోవడంతో నేను లిఫ్ట్ చేశాను.. సితార సినిమాలో తాను కట్టుకున్న ఒక చీరను భానుప్రియ గుర్తు చేశారు.. ఆ చీర కావాలని అడిగితే నేను అది చాలా సాధారణమైన వాయిల్ చీర.. దాని ధర కేవలం 60 రూపాయలు మాత్రమే.. అదెంత మీకు అన్నాను.. అయితే అప్పుడే ఆమె మరోసారి.. భానుప్రియ –
సుమన్ ఇద్దరూ పోలవరం గోదావరి తీరంలో నడుస్తూ ..వెళ్తున్నప్పటి షాట్లు ఆ షార్ట్ లో ఆ చీర తడిసిపోవడం గురించి ఆమె గుర్తు చేశారు.. భానుప్రియ ఆ చీర అడిగినట్టు నాగేశ్వరావు దంపతులకు చెబితే వారు ఆ చీరను పంపిద్దాం అన్నారు. ఆ తర్వాత సితార సినిమాను రష్యాలోకి అనువదించాము.. ఆ విషయం తెలిసి ఇళయరాజా చాలా సంతోషించారు అంటూ తెలిపింది.. అయితే 60 రూపాయల చీర కోసం భానుప్రియ అడిగి మరీ తీసుకోవడం నిజంగా గొప్ప ఆశ్చర్యకరమని చెప్పాలి. ఆమె ఎప్పుడూ చెబుతూ ఉంటుంది.. ఆ చీర తనకు ఎప్పటికీ జ్ఞాపకం గానే మిగిలిపోతుందని.. అయితే ఆమె అలా అడిగి మరీ తీసుకోవడం నాకు కూడా జ్ఞాపకం గానే మిగిలిపోయింది అంటూ వంశీ తెలిపారు.

సితార సినిమా విశేషాలు..

సితార చిత్రాన్ని ఏడిద నాగేశ్వరరావు నిర్మించగా.. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.. 1984లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ పరంగా కూడా గ్రాండ్ సక్సెస్ ను అందుకుంది భానుప్రియ.. తమిళ్లో నటించిన అయాలాన్ సినిమా విడుదల అయింది.. మరో తెలుగు సినిమా కోసం ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇలా ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు , తమిళ్ చిత్రాలలో నటిస్తూ .. ఇటు తెలుగు ఆడియన్స్ కు అటు తమిళ్ ఆడియన్స్ కు మరింత చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే ఆ కాలం నాటి చీర కోసం భానుప్రియ అడిగిందని వంశీ మళ్లీ గుర్తు చేసుకోవడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు