VN Aditya : ఉదయ్ కిరణ్ కి ఎప్పుడూ అదే ధ్యాస – డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

VN Aditya : ఒకానొక సమయంలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకొని అతి తక్కువ సమయంలోనే ఎవరు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుని మరణించారు ఉదయ్ కిరణ్. ఈయన మరణించి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల అవుతున్నా అతని సినిమాలతో పాటు ఆయన గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఈయన మరణంపై స్పందిస్తూ పలు ఆశ్చర్యకర విషయాలు తెలియజేస్తూనే ఉన్నారు. నువ్వు నేను, చిత్రం, మనసంతా నువ్వే, నీ స్నేహం వంటి చిత్రాలతో సూపర్ హిట్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకొని మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్ అవడం, ఫైనాన్షియల్ ఇబ్బందులతో పాటు పలు వ్యక్తిగత కారణాల వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చారు.

సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉదయ్

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే సినిమా తీసి భారీ హిట్టు కొట్టిన డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆదిత్య మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ చాలా మంచి మనిషి.. సినిమాల్లో చూసినట్టే బయట కూడా చాలా క్యూట్ గా ఉంటాడు.. చిన్నవయసులోనే పెద్ద సక్సెస్ చూశాడు. ఇక దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. ఆ తర్వాత ప్లాఫ్స్ , ఇంకొన్ని ఇబ్బందులు రావడంతో తట్టుకోలేకపోయాడు.. ముందు నుంచి ఉదయ్ కిరణ్ కి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఉండేది . ఎప్పుడూ కూడా అదే ధ్యాసలోనే ఉండేవాడు.. ఇక ఈ విషయం నాకు, తేజకి , ఆర్పి పట్నాయక్ కి మాత్రమే తెలుసు.. మేమంతా ఉదయ్ కిరణ్ తో మాట్లాడాము కూడా.. ఆ డిప్రెషన్ నుంచి ఆ ఆలోచన నుంచి బయటకు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశాము. కానీ ఉదయ్ కిరణ్ నిజంగానే అలా చేస్తారని ఊహించలేకపోయాము అంటూ బాధపడ్డారు వి.యన్. ఆదిత్య.. ఇక డైరెక్టర్ ఆదిత్య ఉదయ్ కిరణ్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

వి.ఎన్.ఆదిత్య కెరియర్..

వి.ఎన్. ఆదిత్య కెరియర్ విషయానికి వస్తే.. తెలుగు సినిమా దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఈయన పూర్తి పేరు వాడ్రేవు నాగేంద్ర ఆదిత్య.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. వి.యన్.ఆదిత్య తల్లికి ఆదిత్యాను సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గా చూడాలని ఉండేది. ఎలాగైనా సరే పరీక్షలు రాయమని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఈయన వినలేదట.. అప్పుడు వాళ్ళ అమ్మతో ఒప్పందం చేసుకున్నారట.. అమ్మా.. నాకు ఇప్పుడు 20 ఏళ్లు కదా… ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు నన్ను వదిలేయ్.. నాకు 25 సంవత్సరాలు వచ్చేసరికి నేను డైరెక్టర్ కాకపోతే వెనక్కి వచ్చి నువ్వు చెప్పినట్టే సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తాను.. అప్పటికి ఇంకా మూడేళ్లు ఛాన్స్ ఉంటుంది కదా .. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుంటానని మద్రాస్ వెళ్లిపోయాడట. ఇక తర్వాత భైరవద్వీపం సినిమా కోసం సింగీతం దగ్గర సహాయకుడిగా చేరి.. 1993లో అసిస్టెంట్ డైరెక్టర్గా భైరవద్వీపం సినిమాకు మొదటిసారి ఈయన పేరు పడింది.. ఇక తర్వాత వివిధ దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేసి మనసంతా నువ్వే సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా పరిచయమయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు