Dil Raju : అల్లు అర్జున్ ఆర్య సినిమాలోకి అలా వచ్చాడు

Dil Raju : ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికాడు అని అనిపించేలా చేసింది. గంగోత్రి సినిమా హిట్ అయిన కూడా మంచి గుర్తింపు అయితే అల్లు అర్జున్ కి రాలేదు అని చెప్పాలి.

గంగోత్రి సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్య. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ఇప్పటికి చూసినా కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ని సినిమా క్రియేట్ చేస్తుంది. అంటే ప్రేమంటే ఇద్దరి మధ్య మాత్రమే కాదు… వన్ సైడ్ లవ్ అని కూడా ఉంటుంది. అని ఒక కొత్త కాన్సెప్ట్ ను వెండి తెరపై ప్రజెంట్ చేశాడు సుకుమార్. అప్పట్లో చాలా మందికి వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ సినిమాలోని ఆర్య అనే క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం కూడా చాలామందిని ఆకట్టుకుంది. అందుకే ఇప్పటికి ఆర్య సినిమా చూసిన ప్రతిసారి ఒక ఫ్రెష్ ఫీల్ అనేది క్రియేట్ అవుతుంది.

అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆర్య సినిమాకు ఉన్న ప్రత్యేకత వేరు. ఇప్పటికీ కూడా ఆర్య సినిమా ఇచ్చిన కిక్ ఇంకో సినిమా ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు అల్లు అర్జున్. ఇకపోతే ఈ సినిమాకి అల్లు అర్జున్ కి అవకాశం రావడం ఎలా జరిగిందంటే… దిల్ సినిమా జరుగుతున్న తరుణంలో సుకుమార్ తో నిర్మాత రాజు సినిమా చేస్తానని మాటిచ్చారు. అయితే ఆర్య సినిమా కథను ప్రభాస్ కి చెప్పమని చెప్పారంట దిల్ రాజు. అయితే ప్రభాస్ కి కథను చెప్పేముంది సుకుమార్ ప్రభాస్ తో ఒక మాట చెప్పారట. ఈ కథ నీకు చెప్తాను కానీ మీకు సూట్ అవ్వదు అని చెప్పాడంట సుక్కు. ప్రభాస్ కూడా కథను విన్న వెంటనే కథ బాగా నచ్చిందని మీరు చెప్పినట్టే నాకు సెట్ అవ్వదు అని అనుకున్నాడు.

- Advertisement -

ఆ తర్వాత ఇదే కథను రవితేజ కూడా చెప్పారట . అయితే అది కూడా పట్టాలెక్కలేదు . అయితే దిల్ సినిమా ప్రీమియర్ కోసం అల్లు అర్జున్ వచ్చినప్పుడు, వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్ చూడటం ఈ కథకి అల్లు అర్జున్ సరిపోతాడని సుకుమార్ చెప్పడం. అయితే మొదటి దీనికి దిల్ రాజు ఒప్పుకోకపోవడం. ఆ తర్వాత మళ్లీ ఒప్పుకోవడంతో అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడంట. ఇక అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కి కథ చెప్పడం, కథ అల్లు అర్జున్ కి బాగా నచ్చడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది అనుకునే టైంలో అరవింద్ గారు కొన్ని మార్పులు చెప్పడం. అలా ఎన్నో ఒడిదుడుకులు దాటి ఆర్య సినిమా స్క్రీన్ పైకి వచ్చింది.

అయితే ఆర్య సినిమాకి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కావాలని సుకుమార్ అడిగారట అందుకోసమే ఆర్య సినిమాకి మంచి టెక్నీషియన్స్ కూడా అందించారు దిల్ రాజు. ఇకపోతే ఆర్య సినిమాకి పనిచేసిన ఎంతో మంది దర్శకులు కూడా నేడు దర్శకులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ఆర్య సినిమా ఇలా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. సుకుమార్ స్టార్ డైరెక్టర్ అవడం. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం. 50 సినిమాలకు పైగా దిల్ రాజు నిర్మించడం. వీటన్నిటిలో కూడా ఆర్య సినిమా పాత్ర ఎంతో కొంత వహించింది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు