NTR – K. Viswanath: బాల్య మిత్రులు చీప్‌గా కళ్లద్దాల వల్ల విడిపోయారు… ఆ రోజు అసలేంజరిగిదంటే…?

NTR – K. Viswanath.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటన విభాగంలో ఎన్టీఆర్, దర్శక విభాగంలో కే విశ్వనాథ్ ఇద్దరూ కూడా అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఇలాంటి వారి మధ్య విభేదాలు కేవలం కళ్లద్దాల వల్ల కలిగాయని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇంత దిగ్గజ నటుల మధ్య కేవలం కళ్లద్దాల కోసం వచ్చిన గొడవ ఏంటి ? అసలు ఆ గొడవ ఎందుకు వచ్చింది ? ఎలా వచ్చింది ? అనే విషయాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవం – ఎన్టీఆర్..

సీనియర్ ఎన్టీఆర్ ఒక పౌరాణిక పాత్రలలోనే కాదు ఎలాంటి పాత్ర అయినా సరే.. అందుకు ఆయన పెట్టింది పేరు. అలాగే రాజకీయాలతో కూడా మంచి పేరు దక్కించుకున్నారు. నటుడుగా మాత్రమే కాదు ముఖ్యమంత్రిగా కూడా పేదలకు ఎంతో సేవ చేసి ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారు. నటుడిగా మాత్రమే కాదు ముఖ్యమంత్రిగా కూడా పేదలకు ఎంతో సేవ చేసి ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారు. ఈ క్రమంలోనే ఆయనతో చాలామందికి విభేదాలు ఉండేవి. అయితే కొంతమంది మళ్ళీ కలిసి పోతే కొంత మంది మాట్లాడకుండా చాలా దూరం అయ్యేవారు. అలాంటి వారిలో కె.విశ్వనాథ్ కూడా ఒకరు. దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో అవార్డులను కూడా దక్కించుకున్నారు.

చిన్న గొడవ.. 20 ఏళ్లు దూరం చేసింది..

సాధారణంగా ఏ సినిమా విషయంలో అయినా సరే కొన్నిసార్లు హీరోలకు, దర్శకులకు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం సర్వసాధారణం. అలాగే ఎన్టీఆర్, విశ్వనాథ్ మధ్యలో కూడా ఒక అగాధం ఏర్పడింది. ఈ విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఈ ఇద్దరు స్టార్స్ మొదట్లో మంచి స్నేహితులుగా ఉండేవారు. కానీ ఒక చిన్న విషయం కారణంగా ఇద్దరి మధ్య గొడవ వచ్చి ఆ గొడవ ఏకంగా 20 సంవత్సరాల పాటు వారి మధ్య మాటల్లేకుండా చేసింది. మరి ఇంతకు గొడవకు అసలు కారణం ఏమిటంటే.. ఎన్టీఆర్ కి ఒక అలవాటు ఉండేది ఆయనకు నచ్చకపోయినా తన మాటకు ఎవరైనా అడ్డు చెప్పినా నచ్చని పని చేసిన వెంటనే దూరం పెట్టేస్తారు.

- Advertisement -

కళ్లద్దాల వల్లే గొడవ..

ఈ క్రమంలోని ఒకసారి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా షూటింగ్ జరుగుతోందట. ఒక ఎమోషన్ సీన్ లో కళ్లద్దాలు పెట్టుకొని చేయాలని ఎన్టీఆర్ చెప్పారట. కానీ ఎమోషన్ కనిపించలేదు అని అద్దాలు తీయాలని విశ్వనాథ్ పట్టుబట్టారట. ఎన్టీఆర్ మాత్రం కళ్ళద్దాలు పెట్టుకొని చేస్తాను అని చెప్పారట. దాంతో విశ్వనాథ్ కళ్లద్దాలు తీయాలని పట్టుబట్టడం వల్ల ఇద్దరి మధ్య విభేదానికి కారణం అయ్యింది. అలా ఈ కళ్లద్దాల గొడవ వారిద్దరి మధ్య 20 సంవత్సరాల పాటు మాటలు లేకుండా చేసింది అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇద్దరూ పట్టుదల కలవారు. ఎవరికి వారు తగ్గేదేలే అనుకున్నారు. అందుకే ఆ కళ్లద్దాలు వీరి మధ్య దూరాన్ని పెంచేశాయి. ఇకపోతే కాలేజీలో వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. మొదటి నుంచి మంచి స్నేహబంధం ఉండేది. కానీ ఈ చిన్న కారణం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు