Dil Raju: మాంటేజ్ విని సినిమా ఇచ్చేసాడు

Dil Raju: అన్నం ఉడికిందా లేదా అని తెలియటానికి ఒక్క మెతుకు చూస్తే చాలు అంటారు. అలానే ఒక మనిషిలో టాలెంట్ ఉందా లేదా అని తెలియటానికి తను మాట్లాడే విధానం, అలానే తాను చిన్న పని చేసిన కూడా దానిలో ఒక ప్రత్యేకత కనిపించటం. ఇటువంటివన్నీ కూడా ఒక మనిషిలోని టాలెంట్ కి ప్రతీక అని చెప్పొచ్చు. అయితే చాలామంది దర్శకులు షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ నేడు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కానీ ఒకప్పుడు ఒక డైరెక్టర్ ఆలోచన తీరును బట్టి కొంతమంది నిర్మాతలు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూస్తూ ఉండేవారు.

ఇకపోతే ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ స్టార్ డైరెక్టర్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుకుమార్. అయితే సుకుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందరిలా కాకుండా ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చు అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించాడు. సుకుమార్ ఇంత బాగా సినిమాలు తీయడానికి కూడా కారణం తాను చదివిన పుస్తకాలు. తను చూసిన పరిస్థితులు కూడా అని చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో తన సినిమాలలో మించిన స్క్రీన్ ప్లే నవలల్లో ఉంటుందంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.

లెక్కలు మాస్టర్ గా ఉద్యోగం చేసుకుంటున్న సుకుమార్ దర్శకుడు అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ చాలామంది దగ్గర రచయితగా వర్క్ చేశాడు. అలానే దిల్ సినిమాకి వినాయక్ దగ్గర కూడా శిష్యరికం చేశాడు. అయితే ఏ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయని సుకుమార్ తాను దిల్ సినిమాకు మాత్రమే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని అనుకుంటూ ఉంటాడు. దిల్ సినిమాకి కూడా సుకుమార్ కి పెద్దగా పనేమి చెప్పేవారు కాదంట వినాయక్. కేవలం రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉండటం వలన పెద్దగా పని చెప్పేవారు కాదంట.

- Advertisement -

ఇకపోతే దిల్ సినిమాకి వర్క్ చేస్తున్న తరుణంలో ఒకరోజు దిల్ రాజు గారికి ఒక మాంటేజ్ చెప్పాడు సుకుమార్. అయితే ఆ మాంటేజ్ విని నెక్స్ట్ నీతో సినిమాను చేస్తాను అని చెప్పాడు దిల్ రాజు. “ఒక మేడపై ఒక అమ్మాయి వర్షంలో ఆడుకుంటూ ఉంటుంది. అయితే ఆ వర్షపు నీళ్లంతా కూడా ఒక వైపుకు చేరి ఒక పైపు నుంచి కిందకు పడుతూ ఉంటాయి. ఆ పడుతున్న వాటర్ క్రింద హీరో పై చేతులు చాచి నిలబడి ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఆ మాంటేజ్ దిల్ రాజు కి పిచ్చిపిచ్చిగా నచ్చి నీతో సినిమా చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడంట. అయితే దీన్ని సుకుమార్ నమ్మకపోయినా కూడా అది నిజమైంది.

ఇకపోతే దిల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్నీ షో టైం అప్పుడు సుకుమార్ కి ఫోన్ చేసి మనం సినిమా చేద్దామని దిల్ రాజు అడిగాడంట. అక్కడితో తన దగ్గర ఉన్న ఒక రీమేక్ కథను సుకుమార్ కి ఇచ్చాడంట దిల్ రాజు. అయితే నేను రీమేక్ చేయను అని ఆ స్క్రిప్ట్ను వెనక్కి నెట్టారు సుకుమార్. ఆ తర్వాత కథ చెప్పడం, ఆ కథ కాకుండా మళ్లీ ఆర్య కథను చెప్పడం వలన సుకుమార్ చాలా అష్ట కష్టాలు పడి దర్శకుడిగా మారాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు