Shilpa Shetty Comments : ఆ హీరోతో కన్యత్వాన్ని కొల్పోయా.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Shilpa Shetty Comments : బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ శిల్ప శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ పలు సినిమాల్లో అప్పట్లో హీరోయిన్ గా ఫేమస్ అయింది. విక్టరీ వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాతో బాగా పాపులర్ అయిన శిల్పా శెట్టి కెరీర్ తొలినాళ్లలో తెలుగులో వరుస సినిమాలు చేసింది. అయితే ఆ తర్వాత కొన్ని ప్లాపులు రావడం వల్ల బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ తన అందచందాలతో హీరోయిన్ గా స్టార్ డమ్ తో దూసుకుపోయింది.

ఇక ప్రస్తుతం 50 ఏళ్ళ వయస్సులో కూడా శిల్పా శెట్టి కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. స్లిమ్ గా మెయింటేన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే టైమ్ లో శిల్పా శెట్టికి అమెరికన్ షో బిగ్ బ్రదర్‌ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక అందులో అమెరికన్ షో కావడంతో బోల్డ్ కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారింది ఈ బ్యూటీ. ఈ కామెంట్స్ అప్పట్లో ఆమె చేయగా.. ఇప్పుడు మరోసారి అవి వైరల్ అవుతున్నాయి. ఈ షో లో ఓ హీరోతో తన కెరీర్ బిగినింగ్ లోనే కన్యత్వాన్ని కోల్పోయానని కామెంట్స్ చేసి షాకిచ్చింది.

ఆ హీరోతో 22 ఏళ్లకే..

ఇక శిల్పా శెట్టి అమెరికన్ షో లో మాట్లాడిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆ షో లో శిల్పాశెట్టి మాట్లాడుతూ.. ఆమె పెళ్లికి ముందే తన కన్యత్వాన్ని కోల్పోయినట్లు ఆ షోలో వెల్లడించింది. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన శిల్పా శెట్టి.. 22 ఏళ్ల వరకు ముద్దులు కూడా పెట్టలేదట. కాని ఆ తరువాత కాలంలో, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో డేటింగ్ చేస్తూ, అంతా సమర్పించేసినట్టు చెప్పుకొచ్చింది. అంటే ఈ బ్యూటీతో డేటింగ్ చేసిన మొదటి నటుడు అక్షయ్ కుమార్. అప్పటి వరకు ఈ నటి ఎవరితోనూ డేటింగ్ చేయలేదట. అతనితో తన కన్యత్వాన్ని కోల్పోయానని నటి ఇంటర్వ్యూలో పరోక్షంగా వెల్లడించింది. శిల్పాశెట్టి కెరీర్ తొలినాళ్లలో అక్షయ్‌తో రిలేషన్‌షిప్‌ లో ఉండేదట. అప్పట్లో వీరి డేటింగ్ వార్తలు మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. కాని వీరిద్దరు ఎప్పుడూ ఈ విషయాలను కన్ఫర్మ్ చేయలేదు. ఇక ఎప్పట్నుంచో ఈ వార్తలు వస్తుండగా ఇప్పుడు మళ్ళీ వైరల్ అయ్యాయి.

- Advertisement -
Shilpa Shetty shocking comments on Akshay kumar
Shilpa Shetty shocking comments on Akshay kumar

షో లలో బిజీ బిజీ గా శిల్పా..

ఇక ప్రస్తుతం శిల్పాశెట్టి (Shilpa Shetty) హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. సినిమా నిర్మాత, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్ళి చేసుకుని, తనకు ఇష్టమైన వ్యూను ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారి పేర్లు వియాన్, సమీషా. ఇక ఈ మధ్య పోర్న్ సైట్స్ కేసులో రాజ్ కుంద్ర జైలుజీవితం గడిపి వచ్చారు. అప్పుడు వీరిద్దరూ విడిపోతారని రూమర్స్ వచ్చాయి. కానీ అదేమీ నిజం కాదంటూ భర్తకు సపోర్ట్ గా శిల్ప శెట్టి నిలిచింది. ప్రస్తుతం పలు రకాల టివి షో లలో సందడి చేస్తూ గడుపుతుంది. ఇక త్వరలో సౌత్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు