Sukumar: ఐటెం సాంగ్ వద్దని చెప్పా

Sukumar: ఆర్య సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్. ఇకపోతే సుకుమార్ సినిమాలోని ఐటెం సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటెం సాంగ్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. అయితే ఐటెం సాంగ్స్ గురించి ఇంతకుముందు గతంలో కూడా సుకుమార్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. అయితే సాధారణంగా గోదావరి జిల్లా నుంచి వచ్చినోళ్ళం కాబట్టి ఐటెం సాంగ్ కూడా ఒక స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు అని గతంలో చెప్పుకొచ్చాడు సుకుమార్.

చిన్నప్పుడు కూడా మేము చూసే సినిమాలో పుట్టింటోళ్ళు తరిమేసారు, ఆకు చాటు పిందె తడిసే వంటి పాటలు అప్పట్లో పాడుకునే వాళ్ళం, అంటూ సుకుమార్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇకపోతే సుకుమార్ సినిమాల్లో ఉండే ఐటెం సాంగ్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే కథ సరిగ్గా పీక్ మూమెంట్ కి వెళ్ళే టైం లో ఈ ఐటెం సాంగ్ ఒకటి వస్తుందని చెప్పొచ్చు. ఆర్య సినిమా దగ్గర్నుంచి మొదలు పెడితే రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా వరకు ప్రతి సినిమాల్లో ఒక ఐటెం సాంగ్ అనేది సుకుమార్ సినిమాల్లో ఉంటుంది.

ఇక ఆర్య సినిమాలోని ఆ అంటే అమలాపురం అనే సాంగ్ ఉండటం సుకుమార్ కి నిజంగా ఇష్టం లేదట. అయితే ఒక ట్రైన్ జర్నీలో మణిరత్నం ఫిలిమ్స్ లో ఉండే “చయ్య చయ్య” లాంటి ఒక సాంగ్ ను సుకుమార్ ఊహించుకున్నాడని చెప్పుకొచ్చాడు. స్వతహాగా సుకుమార్ కూడా మణిరత్నం కి ఎంత పెద్ద అభిమానో పలుసార్లు చెప్పుకొచ్చాడు. అయితే ఆ సాంగ్ కాస్త దేవి ట్యూన్ వలన, ఆ తర్వాత దానికి వేటూరి గారు అందించిన లిరిక్స్ వలన అది ఐటమ్ సాంగ్ గా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

అయితే ఆ లిరిక్స్ కూడా తనకు అంతగా నచ్చలేదని, అల్లు వార పిల్లగాడా అనే లైన్ ఎందుకు, నా సినిమాలో హీరో చాలా పూరు వాడికి బైక్ కూడా లేదు కనీసం. వాడు కాలేజీకి సైకిల్ పై వెళ్తుంటాడు. అటువంటి వాడికి ఒక అమ్మాయి పడాలంటే అలాంటి పాట అనవసరం అని అనుకున్నాడట. అయితే దిల్ రాజు ఆర్య సినిమాలో ఐటెం సాంగ్ పెట్టారు. ఆ తర్వాత దిల్ రాజు నిర్మించిన కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ అనేవి ఎక్కువగా ఉండవు. కానీ ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో కూడా ఐటెం సాంగ్ ఒకటి ఉంటుంది అంటూ రీసెంట్ గా జరిగిన ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్ లో చెప్పుకొచ్చాడు సుకుమార్.

ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకి గుర్తింపు లభించింది. అందుకనే ఇప్పుడు వస్తున్న పుష్ప సినిమా సీక్వెల్ పై కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు