Arya20Years celebrations : 125 Days ఆడకపోతే నా పేరు మార్చుకుంటా అన్నాను- అల్లు అర్జున్

Arya20Years celebrations : టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ బిగినింగ్ నుండి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఈనాడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక తొలి సినిమాతో విమర్శలు ఎదుర్కొన్నాడో, మలి సినిమాతో అన్ని ప్రశంసలు అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్ ని యూత్ కి ఎంతో దగ్గర చేసిన సినిమా “ఆర్య”. అంతే కాదు నటన పరంగా కూడా ఎన్నో మెట్లు ఎక్కించింది. ఫీల్ మై లవ్ అంటూ, ప్రేక్షకుల్ని తన ప్రేమపై కాస్త ఫీల్ అవమన్నాడు. ఇక దిల్ రాజుని బడా ప్రొడ్యూసర్ గా మార్చి, టాలీవుడ్ కి లెక్కల మాస్టారు సుకుమార్ ని పరిచయం చేసిన సూపర్ హిట్ మూవీ ఇది. బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం రీసెంట్ గా 20 ఏళ్ళు (Arya20Years celebrations)పూర్తయిన సందర్బంగా చిత్ర యూనిట్ సెలెబ్రేట్ చేసారు. ఈ సందర్బంగా ఆర్య చిత్ర విశేషాలని అల్లు అర్జున్ తన మాటల్లో చెప్పుకొచ్చాడు.

సుక్కూ నా జీవితాన్ని మార్చేశాడు..

ఇక ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అల్లు అర్జున్ మాట్లాడతూ.. “నా జీవితంలో ఏదైనా అతి పెద్ద సందర్భం ఏదైనా ఉందంటే అది ‘ఆర్య’ సినిమాతో రావడం తప్ప మరొకటి కాదు. ఈ సినిమా వల్లనే నేను ఇండస్ట్రీలో నా రెండు అడుగులు వేసుకున్నాను. ఇప్పుడు కొన్ని రేంజ్ మెరుగుదలలు ఉండవచ్చు, కానీ నేను గంగోత్రి తర్వాత -100కి పడిపోయాను, కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత +100కి పెరిగింది, తద్వారా 200% సాధించడం వలన నా కెరీర్‌లో ఆర్య మాత్రమే అతిపెద్ద సక్సెస్ అని అల్లు అర్జున్ అన్నాడు. ఇక తనకు ఈ సినిమా ఇచ్చినందుకు దిల్ రాజు, సుకుమార్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అన్నాడు. ఇక సుకుమార్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ”25 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్న నా జీవితంలో ఒక్క వ్యక్తి అయినా నా జీవితాన్ని మార్చేశాడు. నేను అతని ఆర్యను కాగలననే అతని నమ్మకం, మరియు మేము తరువాత జరిపిన చర్చలు మరియు మేము ఇక్కడకు ఎదిగిన విధానం, ప్రతిదీ అద్భుతమైనదని అన్నాడు.

125 Days ఆడకపోతే నా పేరు మార్చుకుంటా అన్నాను- అల్లు అర్జున్

ఇక అలాగే ఆర్య సక్సెస్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేసాడు అల్లు అర్జున్. ఈ సినిమా అప్పట్లో రిలీజ్ అయిన తోలి రోజుల్లో అంతంత మాత్రమే రెస్పాన్స్ వచ్చిందని, నెమ్మదిగా పికప్ అయిందని అన్నాడు. అలాగే ఈ సినిమా టాక్ ని బయట కనుక్కుంటే 10 వారాల సినిమా అంటున్నారు, అని మేకర్స్ అంటుంటే, తాను మాత్రం ఈ సినిమా వంద రోజులపైనే ఆడుతుంది. ఖచ్చితంగా 125 రోజుల ఈవెంట్ జరుపుతామని అల్లు అర్జున్ చెప్పగా, అనుకున్నట్టుగానే 125 రోజుల సెలబ్రేషన్స్ లో చిరంజీవి గారి చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాను అన్నాడు. అదే సమయంలో దిల్ రాజు మరియు సుకుమార్‌లను మెచ్చుకున్నారు. ఇక ఈ మూవీ సెలబ్రేషన్స్ లో చిత్ర నటీనటులు, టెక్నిషియన్స్ తో సహా అందరూ పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు