Kanakalatha Passes Away : ఒక విషాదం మరువక ముందే మరొకటి.. ప్రముఖ సీనియర్ నటి మృతి..

Kanakalatha Passes Away : సినిమా ఇండస్ట్రీ లో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సినీ రంగానికి చెందిన సినీ నటులు, ప్రముఖ దర్శక నిర్మాతలు, సింగర్స్, రైటర్స్ ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ లో ఈ విషాదాలు జరుగుతుండడం గమనార్హం. ఇక కొన్నేళ్ల కింద ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్లుగా పేరు తెచ్చుకున్న లొల్లు సభ శేషు, గరిమెళ్ల విశ్వేశ్వరరావు, అలాగే ప్రముఖ సినీ రచయిత శ్రీ రామకృష్ణ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీర భద్రరావు, విలన్ డేనియల్ బాలాజీ ఇలా వరుసగా కన్నుమూశారు. ఈ మధ్యనే ప్రముఖ హీరోయిన్ అమృత పాండే, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సింగర్ సింగ్ ఉమా రామనన్ కన్నుమూశారు. ఇవన్నీ కాక మొన్న మరాఠీ ఇండస్ట్రీ లో ప్రముఖ దర్శక రచయిత అయిన క్షితిజ్ జరప్కర్ ఆకస్మికంగా మృతి చెందారు. ఇక నిన్న మలయాళ ఇండస్ట్రీ ప్రముఖ దర్శకుడైన హరి కుమార్ మృతి తో ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం నెలకొని ఉంది. ఇక ఈ ఘటనలు మరువక ముందే మలయాళ ఇండస్ట్రీ లో మరో విషాదం జరిగింది. మలయాళ ఇండస్ట్రీ యొక్క ప్రముఖ సీనియర్ నటి ఈ లోకాన్ని విడిచి వెళ్లింది.

సీనియర్ నటి కనకలత ఆకస్మిక మృతి..

మలయాళంలో దర్శకుడు హరికుమార్ మరణ వార్త నుండి తేరుకోకముందే, మాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం నెలకొంది. మలయాళ, తమిళ భాషల్లో 350 కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ సినీ నటి, అలాగే సీరియల్ నటి కనకలత (63) సోమవారం తన నివాసంలో కన్నుమూశారు. సపోర్టింగ్ రోల్స్ లో నటించిన కనకలత మాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. సినీమాల్లో బిజీగా ఉన్న కనకలత ఆ తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టింది. పలు సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి ఆరోగ్య సమస్యల కారణంగా దూరంగా ఉంటూ వస్తుంది కనకలత. ఆమెకు సీరియల్స్, సినిమాల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ వాటన్నింటికి దూరంగా పెట్టింది.

లాక్ డౌన్ నుండే క్షీణించిన ఆరోగ్యం..

లాక్ డౌన్ సమయంలో కనకలత (Kanakalatha Passes Away) సినిమాలకు దూరంగా ఉంటూ.. మలయింకీజులో తన సోదరి విజయమ్మ ఇంట్లో ఉంటూ వస్తుంది. అయితే రెండో లాక్ డౌన్ నుండే ఆమె క్షీణించింది. 2021 లొ ఆమె ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడింది. ఇండస్ట్రీకి దూరమైనప్పటి నుంచి ఆమె మానసికంగా కృంగిపోతూ ఉండేదని ఆమె సోదరి తెలిపింది. ఇక మోహన్‌లాల్ నటించిన ‘తన్మాత్ర’ చిత్రంలో నటించింది. చిల్ల్, కరియిలక్కట్టుపోలే, జాగ్రత్త, కిరీటం, నా సూర్యపుత్రిక, కౌరవర్, అమ్మాయనే సత్యం, మొదటి భర్తమణి, తచ్చోళి వర్గీస్ చేకవర్, స్ఫటికం, అనియత్తిప్రావ్, హరికృష్ణన్స్, మట్టుపెట్టి మచ్చన్, ప్రియం, పంచవర్ణత, ఆకాశగంగ 2 చిత్రాల్లో నటించింది. అలాగే తమిళ, తెలుగు భాషల్లో కూడా పలు సినిమాల్లో ఆమె నటించింది. ఇక కనకలత మృతి పట్ల పలువురు మలయాళ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు