Rukshar Dhillon : సమ్మర్ లో సెగలు పుట్టిస్తున్న రుక్సార్..

Rukshar Dhillon : టాలీవుడ్ లో ఆకతాయి అనే చిన్న సినిమాతో ఆకతాయిల మనసులలోకి చొచ్చుకునిపోయింది రుక్సార్ ధిల్లాన్. ఆపై కృష్ణార్జున యుద్ధం, ఏబీసీడీ వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది పంజాబీ సుంద‌రి రుక్స‌ర్ థిల్లాన్‌. టాలీవుడ్ లో క్యూట్ గా కనిపించే యంగ్ హీరోయిన్లలో రుక్సార్ ఒకరు. ఆ మధ్య విశ్వ‌క్ సేన్ స‌ర‌స‌న అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమాలో కనిపించిన ఈ భామ టాలీవుడ్ లో చాలా రోజుల పాటు కనిపించలేదు. ఇక లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో స్పార్క్ అనే సినిమాలో నటించినా, ఆ సినిమా ఎప్పుడొచ్చిందో కూడా జనాలకి తెలియదు. ఇక ఈ ఇయర్ మాత్రం టాలీవుడ్ ఆడియన్స్ కి బాగా గుర్తుండి పోతుంది. ఈ ఏడాది సంక్రాంతికి కింగ్ నాగార్జున‌ – అల్ల‌రి న‌రేష్ – రాజ్ త‌రుణ్ ల కాంబోలో వచ్చిన మ‌ల్టీస్టార‌ర్ ‘నా సామి రంగ’ సినిమాలో లో కుమారి పాత్ర‌లో రుక్షార్ థిల్లాన్ న‌టించి మెప్పించింది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కి జోడి గా నటించిన రుక్సార్ కుర్ర‌కారు కు హార్ట్ బీట్ గా మారింది. అయితే టాలీవుడ్ లో వరుస సినిమాలలో మాత్రం ఆఫర్లు రావట్లేదు.

ఛాన్సుల కోసం అందాల ప్రదర్శన..

అయితే టాలీవుడ్ హీరోయిన్ రుక్సార్ దిల్లాన్ (Rukshar Dhillon) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏడేళ్ల పైనే అయినా ఇప్పటివరకు సరైన బ్లాక్ బస్టర్ తగల్లేదని చెప్పాలి. చేసిన అన్ని సినిమాల్లో కూడా అశోక వనంలో అర్జున్ కళ్యాణం హిట్ అయినా, అందులో సెకండ్ హీరోయిన్ అయిపొయింది. ఇక ఈ ఇయర్ వచ్చిన నా సామి రంగ హిట్ అయినా కూడా అందులో కూడా మెయిన్ హీరోయిన్ కాదు. కానీ తన టాలెంట్ తో త‌న‌దైన అందం, ఎన‌ర్జీతో ఊపు తెచ్చింద‌ని చెప్పాలి. నా సామి రంగ సినిమాలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న రుక్సార్ నటించగా, ఈ సినిమా ప్ర‌చారంలో కూడా రుక్సార్ ఎంతో నిజాయితీగా క‌నిపించిందని చెప్పాలి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో అగ్ర‌ కథానాయిక‌గా ఎదగాల‌నేది రుక్సార్ థిల్లాన్ ఆశ‌. కానీ ఆరంభం యువ‌హీరోల‌తోనే అవ‌కాశాలొచ్చాయి. టాలీవుడ్ లో త‌న క‌ల‌ ఇప్ప‌ట్లో నెర‌వేరేట్టు లేదు. అయినా నిరాశ చెంద‌క‌ రుక్సార్ ఫోటోషూట్లతో మేకర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుంది.

సమ్మర్ లోనూ సెగలు పుట్టిస్తుంది..

అయితే రుక్సార్ దిల్లాన్ సినిమాల పరంగా బిజీగా లేకపోయినా వరుస ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. తాజాగా రుక్సార్ దిల్లాన్ చేసిన కొన్ని ఫోటోషూట్ల‌తో తెలుగు యువ‌త‌ను టీజ్ చేస్తోంది. ముఖ్యంగా ఈ బ్యూటీ ఇన్న‌ర్ అందాల ఎలివేష‌న్ మ‌తులు చెడ‌గొడుతోంది. దానిని క‌వ‌ర్ చేస్తూ ఒక ఫుల్ స్లీవ్స్ ష‌ర్ట్ ని ధ‌రించింది రుక్సాన్. ఇక కుర్ర‌బ్యూటీ స్పీడ్ చూస్తుంటే ఆగేట్టు లేదు. తీక్ష‌ణంగా సూటిగా కొంటెగా చూస్తున్న రుక్సార్ ని సోష‌ల్ మీడియాల్లో భారీగానే నెటిజన్లు అట్రాక్ట్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం రుక్సార్ ధిల్లాన్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారుతోంది. ఇక రుక్సార్ నటించే తన తదుపరి సినిమాలకి సంబంధించిన ఏ వివరాలు తెలియలేదు. అయినా సోషల్ మీడియా లో మాత్రం తన ఫోటోషూట్లతో రచ్చ రచ్చ చేస్తుంది ఈ పంజాబీ భామ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు