Sree Leela: చేజేతుల కెరీర్ నాశనం చేసుకుంటున్న శ్రీ లీల ?

Sree Leela: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే అందులో కొంతమంది మాత్రమే చాలా తక్కువ సమయంలో పాపులర్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక కొంతమంది హీరోయిన్లు… తమ తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. ఆ తర్వాత సక్సెస్ అయి… టాప్ మోస్ట్ హీరోయిన్గా కొనసాగుతారు. అయితే అలాంటి హీరోయిన్లలో శ్రీ లీలా ఒకరు.

హీరోయిన్ శ్రీ లీల గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ బ్యూటీ. శ్రీకాంత్ కొడుకు హీరోగా ఈ సినిమాల నటించగా…. హీరోయిన్గా శ్రీ లీల నటించి అందరిని మెప్పించింది. ఈ సినిమాలో తన డాన్స్ అలాగే అందచందాలను ఆరబోసి మంచి మార్కులకు కొట్టేసింది హీరోయిన్ శ్రీ లీల. ఈ సినిమా బంపర్ హిట్ కాకపోయినా హీరోయిన్ శ్రీ లీలాకు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చాయి.

ఈ సినిమా తర్వాత రవితేజ హీరోగా చేసిన ధమాకా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది హీరోయిన్ శ్రీ లీల. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో తిరుగులేకుండా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు కొట్టేసింది. 2022 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా లో శ్రీ లీల డ్యాన్స్ హైలెట్గా నిలిచింది. అయితే ధమాకా సినిమా తర్వాత హీరోయిన్ శ్రీ లీల కెరీర్ పూర్తిగా నాశనమైందని చెప్పవచ్చు. ఒక గుంటూరు టాకీస్ సినిమా మినహా ఏ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.

- Advertisement -

హీరోయిన్ శ్రీ లీలా చేసిన స్కంద, భగవంతు కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. సంక్రాంతి పండుగ నేపథ్యం మరియు మహేష్ బాబు కారణంగా గుంటూరు టాకీస్ కలెక్షన్లను బాగా రాబట్టగలిగింది. ఇక త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయనుంది శ్రీ లీల. ఇలాంటి నేపథ్యంలో మరో ఆఫర్ శ్రీ లీలాకు వచ్చింది. వాస్తవానికి ఈ మధ్యకాలంలో శ్రీ లీలాను ఎవరు పట్టించుకోవడం లేదు. ఐరన్ లెగ్గుగా మారిపోయిందని అంటున్నారు.

ఈ తరుణంలో శింబు సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట హీరోయిన్స్ శ్రీ లీల. దీంతో హీరోయిన్ శ్రీ లీల కెరీర్ ప్రమాదంలో పడిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు హీరో శింబుతో చేసిన హీరోయిన్ల పై అనేక రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వారందరితో హీరో శింబు ఎఫైర్ పెట్టుకున్నారని అందరూ అంటున్నారు. అలాంటి హీరోతో ఇప్పుడు శ్రీ లీల ఓకే చెప్పడం ఫాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. చేజేతుల హీరోయిన్ శ్రీ లీల తన కెరీర్ నాశనం చేసుకుంటుందని అంటున్నారు. ఆ సినిమాకు ఓకే చెప్పకూడదని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై శ్రీ లీలా ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు