Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. కాస్త ముందుగానే రిలీజ్ కానున్న దేవర..!

Devara movie update: టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. నందమూరి హీరోలలో ఏ హీరోకు లేని ఫాలోయింగ్ జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే ఉంది. ఆనాడు నందమూరి తారకరామారావు కు ఉన్న క్రేజీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్…. దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

devara-update-Saif Ali Khan resumes shooting for the Jr NTR starrer Devara
Devara to be released a bit earlier

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా చెప్పిన తేదీ కంటే ముందే రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. షూటింగ్ ను జూలైలోపు పూర్తి చేసి మూవీ విడుదలను ఫ్రీ ఫోన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఇలా జరిగితే అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కావాల్సిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన కం విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తేదీ అయితే కాంపిటీషన్ కూడా ఉండదని చిత్ర బృందం అనుకుంటుందట. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం అందుతుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన… హీరోయిన్ జాన్వి కపూర్ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే జాన్వి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు