Pawan Kalyan: పవన్ ముందు అది కనిపిస్తే అస్సలు ఆగరట.. ఏంటంటే..?

Pawan Kalyan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు వరుస సినిమాలు ప్రకటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా వేగంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన ప్రకటించిన సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు.. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. దీనిని ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు.. గతంలోనే మొదలైన ఈ సినిమా భారీ ఫైట్స్ తో రూపొందుతోంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే..ఇకపోతే ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సినిమా కోసం పవర్ స్టార్ మార్షల్ ఆర్ట్స్ లో మరొకసారి శిక్షణ తీసుకున్నారు..

Pawan Kalyan: If you see it in front of Pawan, you won't stop at all.. What..?
Pawan Kalyan: If you see it in front of Pawan, you won’t stop at all.. What..?

పవన్ కళ్యాణ్ సినిమాలు..

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇంకొక చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే నిలిచిపోయింది. ఈ రెండు మాత్రమే కాదు ఓ.జి సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే పవర్ స్టార్ ఇంత బిజీ షెడ్యూల్లో ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం ఏమిటి? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ముఖ్యంగా ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?అంటూ అభిమానుల సైతం తెగ టెన్షన్ పడిపోతున్నారు మరి ఆయన ఫాలో అయ్యే ఫుడ్ టైట్ ఏంటి? ఆయన అమితంగా ఇష్టపడే ఫుడ్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ఫుడ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా అందులో హైదరాబాద్ బిర్యానీ అంటే మరీ ఇష్టమని తెలుస్తోంది.. వీటితోపాటు నెల్లూరు చేపల పులుసు, నాటుకోడి చికెన్, పులిహోర అంటే పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టమట. అయితే ఈ విషయాలను ఒకసారి త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ వెల్లడించారు.. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి పుస్తకాలు అంటే కూడా చాలా ఇష్టమని.. తన పుస్తకాలను ఏ ఒక్కరికి ఇచ్చేవాడు కాదని.. కానీ త్రివిక్రమ్ కి మాత్రమే తన పుస్తకాలు ఇస్తారని కూడా చెప్పుకొచ్చింది.అలాగే వెజిటేరియన్ ఆహారాలు అంటే కూడా ఇష్టం అని ఉప్మాతో పాటు రవ్వ లడ్డు వంటి స్వీట్లు కూడా ఇష్టంగా తింటారని తెలిపింది.. త్రివిక్రమ్ ఇంటికి వెళ్తే పవన్ కళ్యాణ్ కు ఏదైనా తినే స్వేచ్ఛ ఉంటుందట. అదేవిధంగా పవన్ కూడా మొహమాట పడకుండా తనకు నచ్చింది అడిగిమరీ చేయించుకుని తింటారని సమాచారం. ఇక సినిమా షూటింగ్ సమయంలో ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతూ ఫిట్ గా ఉండే ప్రయత్నం చేస్తారట పవన్ కళ్యాణ్. ఇక ఏది తిన్నా తినకపోయినా తన ముందు హైదరాబాద్ బిర్యానీ ఉంటే మాత్రం అసలు ఆగరని ఆమె స్పష్టం చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు