Sai pallavi: కోట్లు ఇస్తామని ఆఫర్… రిజెక్ట్ చేసిన సాయి పల్లవి ?

Sai pallavi latest update:  టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా సాయి పల్లవి కొనసాగుతున్నారు. ఈ బ్యూటీ సినిమా చేసిందంటే సినిమాలో ఉన్న హీరో సైడ్ అయిపోవాల్సిందే. ఎంత స్టార్ హీరో అయినా కూడా… సాయి పల్లవి ముందు తేలిపోతారు.

అయితే హీరోయిన్ సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి యూస్ చేసిన తెలంగాణ యాషా భాష అందరికీ నచ్చింది. ఈ తరుణంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు… సాయి పల్లవి బాగా దగ్గరయిందని చెప్పవచ్చు. ఇంకేముంది ఆ తర్వాత ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా సాయి పల్లవి మారిపోయింది. దానికి తోడు సాయి పల్లవి అదిరిపోయే డ్యాన్స్ తో అదరగొడుతుంది.

అయితే ఇంత స్టార్ డం ఉన్న సాయి పల్లవి ఇప్పటివరకు ఏ యాడ్ లోను నటించలేదు. తాజాగా ఓ యాడ్ కోసం రెండు కోట్ల ఆఫర్ కూడా ఇచ్చారట కంపెనీ ప్రతినిధులు. దాన్ని కూడా సున్నితంగా తీసుకొని రిజెక్ట్ చేసిందట సాయి పల్లవి. ఓ ఫేర్నెస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు సాయి పల్లవి తో యాడ్ చేయించాలని చాలా ప్రయత్నం చేశారట. రెండు కోట్ల ఆఫర్ కూడా చేశారని సమాచారం. అయినప్పటికీ తనకు డబ్బులు అవసరం లేదని… ఎలాంటి యాడ్ చేయలేదని చెప్పారట. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు