Aishwarya Arjun: అర్జున్ ఇంట పెళ్లి భాజాలు.. డేట్ ఫిక్స్..!

Aishwarya Arjun.. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు హీరో అర్జున్.. కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు.. అందుకే యాక్షన్ కింగ్ గా పేరు సంపాదించారు అర్జున్. ఈయన కూతుర్లు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించినా.. వారు మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు.. కూతుర్లు అంటే అర్జున్ కి చాలా ఇష్టము.. అందుకే వారు ఏ పని చేసినా కూడా కాదనకుండా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తన పెద్ద కూతురు ఐశ్వర్య ప్రముఖ నటుడు ఉమాపతితో ప్రేమలో పడింది.

Aishwarya Arjun: Arjun's house wedding bhajas.. date fix..!
Aishwarya Arjun: Arjun’s house wedding bhajas.. date fix..!

కూతురి ప్రేమను ఒప్పుకున్న అర్జున్..

అలా వీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయాన్ని ఐశ్వర్య తండ్రి అర్జున్ కి చెప్పి వారి ప్రేమను ఒప్పించుకొని మరీ నిశ్చితార్థం చేసుకుంది. గత ఏడాది అక్టోబర్ 10వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ ని తనకు చాలా ఇష్టమైన హనుమాన్ ఆలయంలో గ్రాండ్ గా చేశారు. ఇక ఆ తర్వాత పెళ్లి గురించి మాత్రం ఏ ఒక్క సమాచారాన్ని తెలుపలేదు రెండు కుటుంబాలు. దీంతో అభిమానుల సైతం సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చించుకుంటూ ఉండగా ఎట్టకేలకు అలాంటి రూమర్స్ కి సైతం అర్జున్ చెక్ పెడుతూ.. తన కూతురు వివాహాన్ని అధికారికంగా అనౌన్స్మెంట్ చేసినట్టు తెలుస్తోంది.

ఎంగేజ్మెంట్ జరిగిన గుడిలోనే పెళ్లి కూడా..

కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు.. అర్జున్ కూతురు ఐశ్వర్య నటుడు ఉమాపతి తో వివాహం ఈ ఏడాది జూన్ 10వ తేదీన చాలా గ్రాండ్గా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహాన్ని కూడా ఎంగేజ్మెంట్ చేసిన హనుమాన్ ఆలయంలోనే అర్జున్ దగ్గరుండి మరీ చేయించబోతున్నారట.. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటనను కూడా ఇరువురు కుటుంబ సభ్యులు తెలియజేయబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

ఐశ్వర్య సినిమాలు..

అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్గా పలు చిత్రాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. దీంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వైద్య విద్యను పూర్తి చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.

అర్జున్ సినిమాలు..

అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా విజయ్ దళపతి నటించిన లియో సినిమాలో ఒక అద్భుతమైన పాత్రలో నటించారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ ఇందులో తన పాత్ర మాత్రం హైలెట్గా నిలిచింది. ఇటీవల కాలంలో అర్జున్ సినిమాలలో నటించడం చాలా తగ్గించారని కూడా చెప్పవచ్చు. అయితే పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా చేయడానికి సిద్ధంగానే ఉంటారు అర్జున్. నీకు అందుకే హీరోల సినిమాలలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు అర్జున్. మరొకవైపు నిర్మాతగా డైరెక్టర్ గా కూడా మారే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే యంగ్ హీరో విశ్వక్సేన్ తన కూతురు ఐశ్వర్య అద్దంతో ఒక సినిమా చేయాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాలవల్ల హీరో విశ్వక్సేన్ షూటింగ్స్ పార్టీకి లేటుగా వస్తున్నాడు అన్న కారణాలతో సినిమాలు కూడా నిలిపివేశారు. ఇక ఇప్పుడు తన కూతురి పెళ్లి చేసే పనిలోపడ్డారు అర్జున్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు