Pratinidhi 2 Trailer Talk: ప్రతినిధి 2 ట్రైలర్ రిలీజ్.. వైఎస్ఆర్, జగన్ ని టార్గెట్ చేస్తూ మాస్టర్ ప్లాన్..!

Pratinidhi 2 Trailer Talk: ప్రతినిధి 2 పై వైసీపీ పార్టీ సానుభూతిపరులు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తమ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉందంటూ అనేక ఆరోపణలు చేశారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు నారా రోహిత్ ప్రతినిధి 2 లో హీరో కావడం విశేషం. టిడిపి సానుభూతిపరుడుగా ముద్రపడిన జర్నలిస్ట్ మూర్తి చిత్రాన్ని తెరకెక్కించడం గమన్నార్హం. ఇక ఈ చిత్రంపై ముందు నుంచే వైసిపి వర్గాలు అనేక అడ్డంకులను పెడుతూ వచ్చాయి.

ఓ దశలో సినిమా విడుదల కాకుండా ఉండటం కోసం వైసిపి వర్గాలు చేసిన ప్రయత్నాల వల్ల సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అయిందని ఇండస్ట్రీలో పుకార్లు సైతం షికార్లు చేశాయి. ఇక ఇది ఇలా ఉంటే ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాని హోరెక్కిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తే టార్గెట్ వైయస్ జగన్ అనేలా ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ” ముఖ్యమంత్రిని ఎందుకు చంపాలని అనుకున్నావ్? నీ నేపథ్యం ఏమిటి? ” అనేది ఈ ట్రైలర్ లో వినిపించే మొట్టమొదటి డైలాగ్.

- Advertisement -

ఓ సీఎం మీద మర్డర్ అరెస్ట్ చేసిన ఆరోపణ మీద అరెస్ట్ అయ్యే జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ కనిపించనున్నారు. ఇక సీఎం చనిపోయిన ఘటనలకు సంబంధించిన పలు విషయాలను కూడా ఈ ట్రైలర్లో చర్చించారు. ” అన్నయ్య ఆశలను మాత్రం నువ్వే ముందుకు తీసుకు వెళ్ళాలి రా ” అనే దినేష్ తేజ్ తో బాబాయ్ పాత్రధారి చెబితే.. ” ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? నాన్నగారు చనిపోయి 17 రోజులు కూడా కాలేదు. అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టారా? ” అని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ ట్రైలర్ మొత్తం కొనసాగింది. మొత్తానికి ఈ ట్రైలర్ తో ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెంచేసారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు