HBD Rashmi: రష్మీ గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్..!

HBD Rashmi..తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట నటిగా అడుగుపెట్టి.. ఆ తర్వాత యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ రష్మీ.. ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షోలో సుదీర్ తో కలిసి చేసేటువంటి షోలు, స్కిట్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.. బుల్లితెరపై హాట్ యాంకర్ గా కూడా పేరు సంపాదించిన రష్మీ యూత్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ రోజున రష్మీ 36 వ పుట్టినరోజు సందర్భంగా రష్మీ గురించి తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం.

HBD Rashmi: Shock to know these things about Rashmi..!
HBD Rashmi: Shock to know these things about Rashmi..!

రష్మీ సినీ ప్రయాణం..

బుల్లితెరపై అటు వెండితెర పైన మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ గుంటూరు టాకీస్ సినిమాలో తన అందాల ఆరబోతతో అందరిని ఆకట్టుకుంది. నిజానికి రష్మీ తన వయసు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ప్రస్తుతం రష్మీ వయసు 36 సంవత్సరాలు. నిజానికి రష్మీ 18 ఏళ్ల వయసు నుంచి అవకాశాల కోసం తిరగగా.. చివరిగా 20 ఏళ్లకి హోలీ (2002) చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా గుర్తింపును ఇవ్వలేదు.. ఆ తర్వాత అలా ఎన్నో చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించింది రష్మీ.. అయినా తనకు గుర్తింపు మాత్రం రాలేదు. దాదాపుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 22 సంవత్సరాలు పైనే అవుతోంది.

సినిమాలు షోలే కాదు సీరియల్స్ కూడా..

రష్మీ సినిమాలు , షోలు మాత్రమే కాదు యువ వంటి సీరియల్ లో కూడా నటించింది. ఈ సీరియల్ లో నటించి తర్వాత జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో మంచి క్రేజ్ అందుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పదేళ్ల తర్వాత మంచి క్రేజ్ అందుకుంది రష్మీ. పలు చిత్రాలలో హీరోయిన్స్ గా నటించినప్పటికీ యాంకర్ గానే బాగా సక్సెస్ అవ్వడంతో సినిమాలకు కూడా గుడ్ భై చెప్పేసింది రష్మీ.

- Advertisement -

ఇంత అందంగా ఉండడానికి కారణం..

రష్మీ ఇంత అందంగా ఉండడానికి కారణం ఆమె చేసే పనులే అని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా స్విమ్మింగ్ చేయడంతో పాటు డైటింగ్ పక్కాగా ఫాలో అవుతూ తన గ్లామర్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే ఈ వయసులో కూడా ఈమె ఇంత గ్లామరస్ గా , యంగ్ గా కనిపిస్తోందని చెప్పడంలో సందేహం లేదు.

రష్మీ వారం సంపాదన..

ఇకపోతే ఇంత వయసొచ్చినా యాంకర్ రష్మీ తన పెళ్లి గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.. అందుకే ఈమె పెళ్లి విషయం పైన అభిమానులు మాత్రం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సుధీర్ తో పెళ్లి జరగాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు.. రష్మీ వారానికి 7 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు రకాల ఈవెంట్స్ కి కూడా సపరేట్ ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు షోలు , ఈవెంట్లు అంటూ భారీగా సంపాదిస్తున్న ఈమె అప్పుడప్పుడు యాడ్స్ లో కూడా నటిస్తోంది. ఏదేమైనా ఈరోజు రష్మీ పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి ఇలా ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.. ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా ఆట అభిమానులు ఇటు సెలబ్రిటీలు కూడా బర్తడే విషెస్ తెలియజేస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు